Coal India Data Centers: కోల్ ఇండియా డేటా సెంటర్లు
ABN , Publish Date - Sep 09 , 2025 | 01:42 AM
ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తి దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్).. డేటా సెంటర్ల రంగంలోకి ప్రవేశించే ఆలోచన చేస్తోంది. మూసివేసిన గనుల్లో వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సాధ్యాసాధ్యాలపై...
మూసివేసిన గనుల్లో ఏర్పాటుకు యోచన
కోల్‌కతా: ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తి దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్).. డేటా సెంటర్ల రంగంలోకి ప్రవేశించే ఆలోచన చేస్తోంది. మూసివేసిన గనుల్లో వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సాధ్యాసాధ్యాలపై కన్సల్టెంట్లు, అధికారులతో సమగ్ర అధ్యయనం చేపట్టనున్నట్లు సీఐఎల్ వెల్లడించింది. సీఐఎల్ అనుబంధ విభాగాలకు చెందిన నాలుగు స్థలాలు.. ఉమ్రెర్ (డబ్ల్యూసీఎల్), కోబ్రాలోని సరైపాలి (ఎ్‌సఈసీఎల్), జార్సుగూడ దగ్గర్లోని హిమ్‌గిర్ రాంపూర్ (ఎంసీఎల్), నిగాహి(ఎన్‌సీఎల్)ని ఇందుకు ఎంపిక చేసినట్లు సీఐఎల్ తెలిపింది. కాగా వచ్చే 5-6 ఏళ్లలో దేశీయ డేటా సెంటర్ల రంగంలోకి 2,000-2,500 కోట్ల పెట్టుబడులు రావచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. గడిచిన కొన్నేళ్లలో దేశంలో డిజిటల్ సేవల వినియోగం అనూహ్యంగా పెరిగింది. దాంతో డేటా సెంటర్ల ఆవశ్యకత కూడా పెరుగుతూ వస్తోంది. దేశీయంగా డేటా నిక్షిప్త అవసరాలను తీర్చేందుకు వీలుగా నిరుపయోగంగా ఉన్న గనులను, వాటిలోని మౌలిక వసతులను డేటా సెంటర్ల ఏర్పాటుకు ఉపయోగించుకోవాలని సీఐఎల్ చూస్తోంది. ఇందుకు సంబంధించిన అధ్యయన నివేదిక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబరు-డిసెంబరు)లో అందుబాటులోకి రావచ్చని భావిస్తోంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి