Share News

Ola Uber Rates: రద్దీ వేళల్లో చార్జీలు పెంచుకోవచ్చు.. కేంద్రం నిర్ణయంతో..

ABN , Publish Date - Jul 02 , 2025 | 01:56 PM

ఓలా, ఉబర్ వంటి యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసులు తమ కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. రద్దీగా ఉన్న సమయాల్లో రేట్లు పెంచుకోవచ్చంటూ.. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ.. మోటార్‌ వెహికిల్ అగ్రిగేటర్‌ గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది.

Ola Uber Rates: రద్దీ వేళల్లో చార్జీలు పెంచుకోవచ్చు.. కేంద్రం నిర్ణయంతో..

ఓలా, ఉబర్ వంటి యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసులు తమ కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. రద్దీగా ఉన్న సమయాల్లో రేట్లు పెంచుకోవచ్చంటూ.. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ.. మోటార్‌ వెహికిల్ అగ్రిగేటర్‌ గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది. దీని ప్రకారం రద్దీగా ఉన్న వేళ్లలో బేస్‌ ఛార్జీల్లో సగం సర్‌ఛార్జీ కింద పెంచుకునేందుకు అనుమి ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..


కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ.. మోటార్ వెహికిల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ (Motor Vehicle Aggregator Guidelines 2025) ప్రకారం.. రద్దీగా ఉన్న సమయాల్లో చార్జీలు పెంచుకోవచ్చి తెలిపింది. ప్రస్తుతం ట్రాఫిక్ సమయాల్లో బేస్ రేటుపై 1.5 శాతం తీసుకునేందుకు అవకాశం ఉంది. ప్రస్తుత ఆదేశాల మేరకు.. దీన్ని రెండింతలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు 200 శాతం పెంచుకునే అవకాశం కల్పించింది. అంతకు ముందు ఈ చార్జీ 150 శాతంగా ఉండేది. అలాగే సాధారణ వేళల్లోనూ యాభై శాతం మించకుండా ఛార్జీలు పెంచుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే మూడు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకూడదన్న షరతు విధించింది.


క్యాన్సిల్ చేస్తే.. ఫైన్..

కొత్త నిబంధనల ప్రకారం కారణం లేకుండా డ్రైవర్ రైడ్‌ను క్యాన్సిల్ చేస్తే 10 శాతం ఫైన్ విధించవచ్చు. సుమారు రూ. 100 కు మించకుండా ఫైన్ వేయవచ్చని గైడ్‌లైన్స్‌లో సూచించింది. ఇదే నిబంధన కస్టమర్లకు కూడా వర్తిస్తుంది.


డ్రైవర్లకు ఇన్సూరెన్స్..

క్యాబ్ డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇన్సూరెన్స్ అందించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజా నిబంధనల మేరకు.. డ్రైవర్‌కు కనీసం రూ.5లక్షల ఆరోగ్య బీమాను కల్పిస్తున్నారు. అలాగే 10 లక్షల మేర టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్‌ను కూడా అందిస్తున్నారు. ఈ మేరకు ఆయా క్యాబ్‌ సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్యాసింజర్‌ రైడ్స్‌ కోసం ప్రైవేట్‌ మోటార్‌ సైకిళ్లను ఉపయోగించడానికి కేంద్రం అనుమతించింది. ఆటోలు, బైక్ ట్యాక్సీలు తదితర వాహనాలకు బేస్‌ ఛార్జీలను నిర్ణయించే అధికారాన్ని కేంద్రం.. ఆయా రాష్ట్రాలకు అప్పగించింది. తాజా నిర్ణయంతో కర్ణాటక తదితర రాష్ట్రాల్లో బైక్ ట్యాక్సీలపై విధించిన నిషేధం తొలగిపోనునట్లు తెలుస్తోంది.

Updated Date - Jul 02 , 2025 | 01:56 PM