Cement Prices Drop: తగ్గిన సి మంట
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:23 AM
తెలుగు రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా సిమెంట్ ధరలు తగ్గాయి. రిటైల్ మార్కెట్‌లో సిమెంట్ 50 కిలోల బస్తా ధర రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.30 వరకు తగ్గింది...
బస్తాపై రూ.30 వరకు ఆదా
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): తెలుగు రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా సిమెంట్ ధరలు తగ్గాయి. రిటైల్ మార్కెట్‌లో సిమెంట్ 50 కిలోల బస్తా ధర రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.30 వరకు తగ్గింది. ఈ నెల 21 వరకు బ్రాండును బట్టి ధర రూ.290 నుంచి రూ.370 వరకు ఉండేది. జీఎ్‌సటీ భారం 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గడంతో ఇప్పుడది రూ.260 నుంచి రూ.330 వరకు పలుకుతోంది. దీంతో గత నెల రోజుల నుంచి వినియోగదారులు కొనుగోళ్లకు ముందుకు వస్తున్నట్టు రిటైల్ డీలర్లు చెబుతున్నారు.
పెరగనున్న డిమాండ్: నిన్న మొన్నటి వరకు దేశ వ్యాప్తంగా సిమెంట్ అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి నెల సగటున 23 నుంచి 25 లక్షల టన్నుల సిమెంట్ అమ్ముడయ్యేది. వర్షాల దెబ్బకు అది గత నెల 21 లక్షల టన్నులకు పడిపోయినట్టు పరిశ్రమ వర్గాలు చెప్పాయి. పండుగల సీజన్, జీఎ్‌సటీ లాభం తోడవడంతో అమ్మకాలు మళ్లీ పుంజుకుంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం 55 నుంచి 60 శాతం వరకు ఉన్న ఉత్పత్తి సామర్ధ్య వినియోగం జనవరి నాటికి 60 శాతం మించే అవకాశం ఉందని ఒక కంపెనీ డైరెక్టర్ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
For More AP News And Telugu News