Stock Market Outlook: ఆచితూచి వ్యవహరించండి
ABN , Publish Date - Aug 25 , 2025 | 01:37 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబరులో యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉండటం, జీఎస్‌టీ సంస్కరణలు సూచీలకు దన్నుగా నిలిచే వీలుంది. అయితే ట్రంప్ టారిఫ్స్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబరులో యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉండటం, జీఎస్‌టీ సంస్కరణలు సూచీలకు దన్నుగా నిలిచే వీలుంది. అయితే ట్రంప్ టారిఫ్స్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ విరమణపై స్పష్టత లేకపోవటం సూచీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకున్న షేర్లలో పెట్టుబడులు పెట్టడం మంచిది. నిఫ్టీ గత శుక్రవారం 200 పాయింట్లకు పైగా పతనమవ్వటం లాభాల స్వీకరణను సూచిస్తోంది. మద్దతు లభిస్తే మళ్లీ పుల్‌బ్యాక్ ర్యాలీకి అవకాశం ఉంటుంది.
స్టాక్ రికమండేషన్స్
ఎన్‌ఎ్‌సడీఎల్: కొన్ని రోజుల కిందే స్టాక్ మార్కెట్లో లిస్టయిన ఈ షేరు మెరుగ్గా రాణిస్తోంది. ఐపీఓ గరిష్ఠ స్థాయి తర్వాత షేరు టైట్‌గా చలిస్తోంది. ప్లాగ్ స్ట్రక్చర్ కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.1,275 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,450 టార్గెట్ ధరతో రూ.1,250 స్థాయిలో అక్యుములేట్ చేసుకుంటూ పడే కొద్ది కొనుగోలు చేయాలి. రూ.1,210 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
ఎక్సైడ్ ఇండస్ట్రీస్: కొన్ని నెలలుగా డౌన్‌ట్రెండ్‌లో సాగుతూ వస్తున్న ఈ షేరు ప్రస్తుతం రివర్సల్ అవుతోంది. హయ్యర్ హై ఫామ్ చేస్తూ అక్యుములేషన్ జోన్‌లో ఉంది. బ్యాటరీ ఇండస్ట్రీ బ్రెడ్త్ సైతం మెరుగవుతోంది. స్వల్ప, మధ్యకాలిక మూమెంటమ్ బాగుంది. గత శుక్రవారం రూ.396 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.380/390 శ్రేణిలో ఎంటరై రూ.455 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. రూ.370 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
సుప్రీమ్ ఇండస్ట్రీస్: గత ఏడాది జూన్ నుంచి డౌన్‌ట్రెండ్‌లో కొనసాగుతూ వస్తున్న ఈ కౌంటర్ ఈ ఏడాది మే నుంచి రివర్సల్ బాట పట్టింది. ప్రస్తుతం కీలక నిరోధ స్థాయి రూ.4,700 వద్ద చలిస్తోంది. దీన్ని అధిగమిస్తే మరింత పెరగటం ఖాయం. మూమెంటమ్ క్రమంగా మెరుగవుతోంది. గత శుక్రవారం రూ.4,637 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.4,600 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.4,780 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.4,560 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఇప్కా ల్యాబ్స్: కొన్ని నెలలుగా అక్యుములేషన్ జోన్‌లో కొనసాగుతున్న ఈ షేరు ప్రస్తుతం కీలక మద్దతు స్థాయి రూ.1,350 నుంచి రివర్సల్ అయ్యింది. డార్వాస్ బాక్స్ మాదిరిగా కొంతమేర స్వింగ్ లభించే సూచనలు ఉన్నాయి. గత శుక్రవారం రూ.1,418 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,400 స్థాయిలో పొజిషన్ తీసుకుని రూ.1,580/1,650 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,360 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఆదిత్య ఇన్ఫోటెక్: కొన్ని రోజుల క్రితమే మార్కెట్లో లిస్టయిన ఈ షేరు దూకుడు మీద ఉంది. నిఫ్టీతో పోల్చితే జోరు ప్రదర్శిస్తోంది. గత శుక్రవారం రూ.1,360 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,300 శ్రేణిలో ప్రవేశించి రూ.1,550 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. రిస్క్ ప్రొఫైల్‌ను బట్టి దీర్ఘకాలం మదుపు చేసుకోవచ్చు. రూ.1,260 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News