Caution and Selective Investment: ఆచితూచి వ్యవహరించండి
ABN , Publish Date - Oct 27 , 2025 | 05:19 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. మారుతున్న అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలు, అమెరికాతో వాణిజ్య ఒప్పందం, అనిశ్చితి ఇందుకు కారణాలు. మరోవైపు మదుపరులు...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. మారుతున్న అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలు, అమెరికాతో వాణిజ్య ఒప్పందం, అనిశ్చితి ఇందుకు కారణాలు. మరోవైపు మదుపరులు కూడా కొనుగోళ్లకు పెద్దగా ఆసక్తి చూపించటం లేదు. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించటం మంచిది.
స్టాక్ రికమండేషన్స్
టాటా ఎలెక్సీ: రెండేళ్లుగా పతనమవుతూ వస్తున్న ఈ షేరు ప్రస్తుతం కీలకమైన మద్దతు స్థాయికి చేరుకుంది. ఇక్కడ కాస్త బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.5,544 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.5,500 స్థాయిలో అక్యుములేట్ చేసుకుంటూ రూ.5,750/6,250 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ రూ.5,380.
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్: ఈ కౌంటర్ ఆరు నెలలుగా అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. ప్రస్తుతం బ్రేకౌట్ అయ్యింది. పైగా రిలేటివ్ స్ట్రెంత్ మెరుగ్గా ఉంది. గత శుక్రవారం రూ.1,036 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,080/1,150 టార్గెట్ ధరతో రూ.1,020 వద్ద పడుతున్నప్పుడు కొనుగోలు చేయాలి. రూ.990 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
టాటా కన్స్యూమర్: ఏడాది గరిష్ఠాన్ని బ్రేక్ చేసిన ఈ కౌంటర్ ప్రస్తుతం పుల్‌బ్యాక్ అయ్యింది. గత శుక్రవారం రూ.1,896 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,860 శ్రేణిలో ప్రవేశించి రూ.2,050/2,100 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ రూ.1,810.
భారత్ డైనమిక్స్ లిమిటెడ్: గత ఆరు నెలలుగా డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తున్న ఈ కౌంటర్‌లో ప్రస్తుతం బేస్ ఏర్పడుతోంది. ట్రెండ్ రివర్సల్ అయ్యే అవకాశం ఉంది. రక్షణ రంగం మళ్లీ పుంజుకుంటుండటంతో మదుపరులు మళ్లీ ఆసక్తి కనబరుస్తున్నారు. గత శుక్రవారం రూ.1,544 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,500 ఎగువన పొజిషన్ తీసుకుని రూ.1,650/1,800 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.1,450 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
కేపీఐటీ టెక్నాలజీస్: రెండేళ్లుగా జీరో రిటర్నులు ఇచ్చిన ఈ కౌంటర్ ఏడాది కాలంగా డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తోంది. గత శుక్రవారం రూ.1,178 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,150 ఎగువన పొజిషన్ తీసుకుని రూ.1,300 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ రూ.1,120.
- మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్
పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టం.. భానుప్రకాష్ వార్నింగ్
Read Latest AP News And Telugu News