Delhi Car Blast: ఢిల్లీ పేలుడు ఘటన.. వాహనాలు అమ్మే ముందు ఈ జాగ్రత్తలు పాటించండి!
ABN , Publish Date - Nov 11 , 2025 | 05:14 PM
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు ఘటన దృష్ట్యా తమ కార్లు అమ్మే యజమానులు దృష్టి సారించారు. కార్లు అమ్మేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యహరించాలని అభిప్రాయపడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 11: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేశాయి. మరోవైపు ఈ ఘటనలో పేలిపోయిన కారుపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ కారు ఎవరిది? దుండగులు ఎందుకు కారును పేల్చారు? అనే అనుమానాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పోలీసుల దర్యాప్తులో భాగంగా కారు అమ్మకం, కొనుగోలుతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను అధికారులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిలిపి ఉంచిన ఒక i20 కారు అకస్మాత్తుగా పేలిపోయిందని.. దాంతో పలు వాహనాలు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే.
ఈ ఘటన దృష్ట్యా తమ కార్లు అమ్మే యజమానులు దృష్టి సారించారు. కార్లు అమ్మేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యహరించాలని అభిప్రాయపడుతున్నారు.
➤యాజమాన్య బదిలీ లేకుండా వాహనాన్ని అమ్మితే.. మొదటి యజమాని చిక్కుల్లో పడక తప్పదు.
➤ఎందుకంటే మొదటి యజమానే పేరు రిజిస్టర్ చేయబడినందున చట్టపరంగా అతనే యజమానిగా ఉంటాడు.
➤ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) రికార్డులలో యాజమాన్యం అధికారికంగా బదిలీ అయ్యే వరకు వాహనానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
➤ఆ వాహనంలో ఏదైనా ప్రమాదం జరిగినా, వాహనం ప్రమాదానికి గురైనా మొదలు వాహనాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి(మొదటి యజమాని)నే పోలీసులు సంప్రదిస్తారు.
అందుకే వాహనాన్ని అమ్మేటప్పుడు సదరు వ్యక్తి గురించి తెలుసుకొని అమ్మడం బెటర్. లేదంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మొదటి యజమానే ప్రమాద బాధితులను పరిహారం చెల్లించవలసి వస్తుంది. వాహనాలను అమ్మే ముందు కొనుగోలుదారుడి ఐడెంటిటీ ప్రూఫ్ (ఐడీ కార్డు), అడ్రెస్ ప్రూఫ్ PAN కార్డ్ జీరాక్స్ కాపీలను అడగండి. వాహనంపై పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు, రోడ్డు పన్ను లేవని నిర్ధారించుకున్నాకే వాహనాలు అమ్మడం సరైనదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..
లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..