Rudraksha Exports: స్విట్జర్లాండ్‌లో రుద్రాక్షకు భలే డిమాండ్
ABN , Publish Date - Sep 29 , 2025 | 01:47 AM
భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీక అయిన రుద్రాక్షలు ఇప్పుడు అంతర్జాతీయ వెల్‌నెస్ మార్కెట్‌లో కీలక స్థానం ఏర్పడింది. ప్రధానంగా స్విట్జర్లాండ్‌లో భారతీయ ప్రవాసులే కాకుండా, స్థానిక ప్రజలు కూడా రుద్రాక్షల కోసం...
న్యూఢిల్లీ: భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీక అయిన రుద్రాక్షలు ఇప్పుడు అంతర్జాతీయ వెల్‌నెస్ మార్కెట్‌లో కీలక స్థానం ఏర్పడింది. ప్రధానంగా స్విట్జర్లాండ్‌లో భారతీయ ప్రవాసులే కాకుండా, స్థానిక ప్రజలు కూడా రుద్రాక్షల కోసం విపరీత మైన ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదిభారత ఎగుమతిదారులకు అద్భుతమైన అవకావమని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్న ఇండియా-ఈఎ్‌ఫటీఏ వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (టీఈపీఏ).. ఇందుకు ప్రధాన దోహదకారి కానుందని అధికారులంటున్నారు. 2024-25లో భారత్ రూ.0.97 కోట్ల విలువైన రుద్రాక్షను ఎగుమతి చేసింది. ప్రవాస భారతీయులే కాకుండా స్థానిక స్విస్ ప్రజల్లో వెల్‌నెస్, యోగాపై పెరుగుతున్న ఆసక్తిని ఆసరా చేసుకుని జ్యూరిచ్‌లోని యోగా ఆన్‌లైన్ స్టోర్లు, వెల్‌నెస్ దుకాణాలు శరీరాన్ని చల్లబరిచే శక్తి కలిగిన ఉత్పత్తులుగా రుద్రాక్షకు ప్రచారం కల్పిస్తున్నాయి. ఒక్కో మాలను 50 స్విస్ ఫ్రాంకులకు (దాదాపు రూ.4,659) విక్రయిస్తున్నాయి.
ఇవీ చదవండి:
Allianz Global Wealth Report 2025: కుటుంబాల సంపద మరింత పైకి
Pharma Stocks Plunge: ఫార్మా సుంకాల షాక్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి