Share News

Reliance Communications: ఆర్‌కామ్‌ది మోసపూరిత ఖాతానే బీఓఐ

ABN , Publish Date - Aug 25 , 2025 | 01:26 AM

అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) రుణ ఖాతాను బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) కూడా మోసపూరిత ఖాతాగా ప్రకటించింది. ఆర్‌కామ్‌ వ్యాపార విస్తరణ పేరుతో 2016 ఆగస్టులో అనిల్‌ అంబానీ....

Reliance Communications: ఆర్‌కామ్‌ది మోసపూరిత ఖాతానే బీఓఐ

న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) రుణ ఖాతాను బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) కూడా మోసపూరిత ఖాతాగా ప్రకటించింది. ఆర్‌కామ్‌ వ్యాపార విస్తరణ పేరుతో 2016 ఆగస్టులో అనిల్‌ అంబానీ తమ నుంచి తీసుకున్న రూ.700 కోట్లను దారి మళ్లించి జేబులో వేసుకున్నట్టు బీఓఐ రెగ్యులేటరీ సంస్థలకు తెలిపింది. ఆర్‌కామ్‌ రుణ ఖాతాను ఎస్‌బీఐ ఈ ఏడాది జూన్‌లోనే మోసపూరిత ఖాతాగా ప్రకటించింది. కాగా తమ నుంచి తీసుకున్న రూ.700 కోట్ల రుణ మొత్తాన్ని ఆర్‌కామ్‌ నిబంధనలకు విరుద్ధంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసిందని బీఓఐ పేర్కొంది. మరోవైపు అనిల్‌ అంబానీపై సీబీఐ నమోదు చేసిన కేసుల ప్రభావం తమ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు, వాటాదారులు, ఉద్యోగులపై ఏ మాత్రం ఉండదని రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా ప్రకటించాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 25 , 2025 | 01:27 AM