Share News

Biological E Malaria Vaccine: బయోలాజికల్‌ ఈ ఐఐఎల్‌కు మలేరియా వ్యాక్సిన్‌ లైసెన్సు

ABN , Publish Date - Sep 10 , 2025 | 01:44 AM

బహుళ దశల్లో వినియోగించే మలేరియా వ్యాక్సిన్‌ యాడ్‌ఫాల్సివ్యాక్స్‌ తయారీ లైసెన్సును భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) ఐదు కంపెనీలకు అందించింది. ఈ లైసెన్సు పొందిన కంపెనీల్లో...

Biological E Malaria Vaccine: బయోలాజికల్‌ ఈ ఐఐఎల్‌కు మలేరియా వ్యాక్సిన్‌ లైసెన్సు

న్యూఢిల్లీ: బహుళ దశల్లో వినియోగించే మలేరియా వ్యాక్సిన్‌ యాడ్‌ఫాల్సివ్యాక్స్‌ తయారీ లైసెన్సును భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) ఐదు కంపెనీలకు అందించింది. ఈ లైసెన్సు పొందిన కంపెనీల్లో హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఈ (బీఈ),ఇండియన్‌ ఇమ్యూనోలాజికల్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎల్‌) సహా టెక్‌ ఇన్వెన్షన్‌ లైఫ్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పనేషియా బయోటెక్‌, జైడస్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఉన్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇండియా మెడ్‌టెక్‌ ఎక్స్‌పో 2025లో ఈ విషయం ప్రకటించారు. రోగుల్లో ప్రాణాంతకమైన ప్లాస్మోడియం ఫాల్సిపారం ఇన్ఫెక్షన్‌ను అదుపు చేసి సమాజంలోని ఇతరులకు మలేరియా వ్యాపించకుండా ఉపయోగపడే ఈ వ్యాక్సిన్‌ను ఐసీఎంఆర్‌ పర్యవేక్షణలో భువనేశ్వర్‌కు చెందిన రీజినల్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (ఆర్‌ఎంఆర్‌సీ) అభివృద్ధి చేసింది. కాగా ఈ వ్యాక్సిన్‌ తయారీకి అర్హత గల కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలను ఐసీఎంఆర్‌ గత జూలైలో ఆహ్వానించింది. ఈ వ్యాక్సిన్‌ అందుబాటు ధరల్లో లభించడంతో పాటు గది ఉష్ణోగ్రతలో 9 నెలల పాటు సమర్థవంతంగా నిలవగలుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 10 , 2025 | 01:44 AM