Share News

బడా షేరు బేజార్‌.. చిన్న స్టాక్‌ జిగేల్‌

ABN , Publish Date - Feb 21 , 2025 | 04:13 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీ వరుసగా మూడో రోజు నష్టపోయాయి. గురువారం ట్రేడింగ్‌ ముగిసేసరికి, సెన్సెక్స్‌ 203.22 పాయింట్లు కోల్పోయి 75,735.96 వద్దకు జారుకోగా...

బడా షేరు బేజార్‌.. చిన్న స్టాక్‌ జిగేల్‌

  • సెన్సెక్స్‌ 203 పాయింట్లు డౌన్‌

  • ఒక శాతానికి పైగా పెరిగిన స్మాల్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీ వరుసగా మూడో రోజు నష్టపోయాయి. గురువారం ట్రేడింగ్‌ ముగిసేసరికి, సెన్సెక్స్‌ 203.22 పాయింట్లు కోల్పోయి 75,735.96 వద్దకు జారుకోగా.. నిఫ్టీ 19.75 పాయింట్ల నష్టంతో 22,913.15 వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు పెద్ద షేర్లలో అమ్మకాలకే మొగ్గుచూపడం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగడం ఇందుకు కారణమయ్యాయి. కాగా, గత కొన్ని రోజుల్లో భారీగా క్షీణించిన చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్లలో ట్రేడర్లు వాల్యూ బైయింగ్‌ జరిపారు. దాంతో బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్‌ సూచీ 1.32 శాతం ఎగబాకగా.. మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1.18 శాతం పెరిగింది. రంగాలవారీ సూచీల్లో బ్యాంకెక్స్‌, ఆర్థిక సేవలు, ఫోకస్డ్‌ ఐటీ, ఎఫ్‌ఎంసీజీ నేలచూపులు చూడగా.. పవర్‌, యుటిలిటీస్‌, మెటల్‌ 2 శాతానికి పైగా పెరిగాయి.


ఇవి కూడా చదవండి:

Stock Markets: ఈరోజు కూడా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్


Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..

BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 21 , 2025 | 04:13 AM