Banking Stocks Analysis: బ్యాంకింగ్ ఫైనాన్స్ షేర్లపై కన్నేయండి
ABN , Publish Date - Dec 08 , 2025 | 02:45 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా చలించే అవకాశం ఉంది. ఆర్‌బీఐ రెపోరేటు తగ్గించటం, భారత ఆర్థిక వృద్ధి రేటు బాగున్నప్పటికీ ఎఫ్‌ఐఐలు క్రమంగా పెట్టుబడులు...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా చలించే అవకాశం ఉంది. ఆర్‌బీఐ రెపోరేటు తగ్గించటం, భారత ఆర్థిక వృద్ధి రేటు బాగున్నప్పటికీ ఎఫ్‌ఐఐలు క్రమంగా పెట్టుబడులు ఉపసంహరిస్తుండటం, రూపాయి పతనం కీలకంగా ఉండనున్నాయి. అమెరికా పరిస్థితి, జాబ్ మార్కెట్ నానాటికి క్షీణిస్తుండటం నెగటివ్ సెంటిమెంట్‌కు దారి తీస్తోంది. గత వారం ఐటీ, మెటల్, ఆటో రంగాల షేర్లు జోరు ప్రదర్శించాయి. ఈ వారం ఈ రంగాలతో పాటు బ్యాంకింగ్, ఫార్మా షేర్లు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.
స్టాక్ రికమండేషన్స్
ఎస్‌బీఐ కార్డ్స్: ప్రస్తుతం ఈ షేరు కీలక జోన్‌లో ఉంది. ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించటంతో వీటిపై ఆసక్తి నెలకొంది. ఈ షేరు స్వల్పకాల నిరోధ స్థాయికి చేరే అవకాశం ఉంది. గత శుక్రవారం రూ.885 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.880 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.955/990 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ రూ.865.
ఇండస్ టవర్: సెప్టెంబరు నుంచి అప్‌ట్రెండ్‌లో కొనసాగుతున్న ఈ షేరు కొంతకాలంగా సైడ్‌వే్‌సలో చలిస్తూ కన్సాలిడేట్ అయ్యింది. స్వల్పకాల నిరోధాన్ని బ్రేక్ చేసేందుకు సిద్ధమైంది. పైగా నిఫ్టీతో పోలిస్తే జోరును ప్రదర్శిస్తోంది. గత శుక్రవారం రూ.415 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.410 శ్రేణిలో ప్రవేశించి రూ.450/480 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.400 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
చోళ ఫైనాన్స్: ప్రస్తుతం ఈ షేరు జీవితకాల గరిష్ఠ స్థాయిలో కదలాడుతోంది. రిలేటివ్ స్ట్రెంత్ బాగుంది. రెపో రేటు తగ్గింపు నేపథ్యంలో ఈ కౌంటర్‌పై ఆసక్తి నెలకొంది. 52 వారాల గరిష్ఠాన్ని బ్రేక్ చేసిన తర్వాత కన్సాలిడేట్ అవుతోంది. గత శుక్రవారం రూ.1,730 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,720 ఎగువన పొజిషన్ తీసుకుని రూ.1,780-1,920 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ రూ.1,700.
ఆర్‌బీఎల్ బ్యాంక్: ఈ ఏడాది ఆరంభం నుంచి ఈ షేరు అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. రూ.340 స్థాయిని తాకిన తర్వాత కొంత బలహీనత కనిపిస్తోంది. అయితే వాల్యూమ్ తక్కువగా నమోదవుతుండటం గమనార్హం. గత శుక్రవారం రూ.305 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.300 పై స్థాయిలో ప్రవేశించి రూ.375 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ రూ.285.
పీఎన్‌బీ హౌసింగ్: ఆగస్టులో డివిడెండ్ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా పతనమైన ఈ షేరు ప్రస్తుతం మీడియం టర్మ్ ఆఫ్ ట్రెండ్‌లో ఉంది. రూ.954 వద్ద సమీప నిరోధాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నది. గత శుక్రవారం రూ.903 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.890 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.955 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.875 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
- మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఇవీ చదవండి:
ఎస్‌ఐపీ పెట్టుబడుల ఆకర్షణలో పడి ఈ తప్పు చేయొద్దు.. ఓ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అధికారి సూచన
భారత సంతతి వ్యక్తికి యాపిల్ సంస్థలో కీలక బాధ్యతలు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి