Bank Holidays This Week : ఈ వారంలో బ్యాంకులకు సెలవు దినాలు
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:31 PM
దసరా పండుగ, ఇతర పబ్లిక్ హాలీడేస్ కారణంగా అక్టోబర్ నెలలో బ్యాంకులు పలు చోట్ల, ఆయా రోజుల్లో పనిచేయవు. దీని వల్ల బ్యాంకు ఖాతాదారులు తమ లావేదేవీల నిమిత్తం ముందుగానే ప్లాన్ చేసుకుంటే మంచింది.
ఇంటర్నెట్ డెస్క్ : గాంధీ జయంతి, దుర్గా పూజ, నవరాత్రి, దసరా వంటి ప్రధాన పండుగల కారణంగా అక్టోబర్ నెలలో బ్యాంకులు పలు చోట్ల, ఆయా సెలవు దినాల్లో పనిచేయవు. ఆయా రోజుల్లో జాతీయ, ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక దినాలు, వారాంతపు సెలవుల కారణంగా బ్యాంకింగ్ సేవలు ప్రభావితమవుతాయి.
అక్టోబర్‌లో దేశ వ్యాప్తంగా బ్యాంకు హాలిడేలు: రోజువారీ వివరాలు ఇలా ఉన్నాయి:
అక్టోబర్ 1 (బుధవారం) నవరాత్రి ముగింపు / మహా నవమి / దసరా / ఆయుధ పూజ / విజయదశమి / దుర్గా పూజ కారణంగా అగర్తలా, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గాంగ్‌టాక్, గువహాటి, ఇటానగర్, కాన్పూర్, కోచి, కోహిమా, కోల్‌కతా, లక్నో, పట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురం ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు.
అక్టోబర్ 2 (గురువారం) మహాత్మా గాంధీ జయంతి / దసరా / విజయ దశమి / దుర్గా పూజ / శ్రీ శ్రీ శంకరదేవ జన్మోత్సవం దేశవ్యాప్తం (ప్యాన్-ఇండియా) సెలవు.
అక్టోబర్ 3 (శుక్రవారం) దుర్గా పూజ గాంగ్‌టాక్ ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు.
అక్టోబర్ 4 (శనివారం) దుర్గా పూజ గాంగ్‌టాక్ ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు.
అక్టోబర్ 5 (ఆదివారం) వీక్లీ ఆఫ్ (సండే) దేశవ్యాప్తం (ప్యాన్-ఇండియా) సెలవు.
ఈ హాలిడేలు ఆర్‌బీఐ ద్వారా నిర్ణయించబడిన జాతీయ, ప్రాంతీయ పండుగల ఆధారంగా ఉన్నాయి. అలాగే, రెండవ, నాల్గవ శనివారాలు, అన్ని ఆదివారాలు బ్యాంకులకు సెలవు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సహా ప్రధాన బ్యాంకులు ఈ రోజుల్లో పూర్తిగా మూసివేస్తారు.
ఇవి కూడా చదవండి..
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త
ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం