Bajaj Electricals Acquires: బజాజ్ ఎలక్ట్రికల్ చేతికి మర్ఫీ రిచర్డ్స్ బ్రాండ్ హక్కులు
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:13 AM
అంతర్జాతీయ ఎలక్ట్రికల్ అప్లయెన్స్ బ్రాండ్ మర్ఫీ రిచర్డ్స్ మేధో సంపత్తి హక్కులను కొనుగోలు చేస్తున్నట్లు బజాజ్ ఎలక్ట్రికల్స్ బుధవారం ప్రకటించింది. ఐర్లాండ్‌కు చెందిన గ్లెన్ డింప్లెక్స్ గ్రూప్‌లో...
ఒప్పందం విలువ రూ.146 కోట్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఎలక్ట్రికల్ అప్లయెన్స్ బ్రాండ్ మర్ఫీ రిచర్డ్స్ మేధో సంపత్తి హక్కులను కొనుగోలు చేస్తున్నట్లు బజాజ్ ఎలక్ట్రికల్స్ బుధవారం ప్రకటించింది. ఐర్లాండ్‌కు చెందిన గ్లెన్ డింప్లెక్స్ గ్రూప్‌లో భాగమైన గ్లెన్ ఎలక్ట్రిక్ నుంచి ఈ హక్కులను దక్కించుకోనున్నట్లు తెలిపింది. ఈ డీల్‌లో భాగంగా బజాజ్ ఎలక్ట్రికల్స్‌కు భారత్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంక మార్కెట్లలో మర్ఫీ రిచర్ట్స్ బ్రాండ్ హక్కులు కూడా లభించనున్నాయి. ఈ ఒప్పందం విలువ రూ.146 కోట్లు. బజాజ్ ఎలక్ట్రికల్స్ గత రెండు దశాబ్దాలుగా మర్ఫీ రిచర్డ్స్ బ్రాండ్‌తో లైసెన్సు ఒప్పందం కలిగి ఉంది. తద్వారా సంస్థ మర్ఫీ రిచర్డ్స్ బ్రాండ్ మిక్సర్లు, ఓవెన్, టోస్టర్ గ్రిల్స్, కాఫీ మేకర్స్, ఎయిర్ ఫ్రేయర్స్, ఐరన్ బాక్సులు, హాట్ ఎయిర్ బ్రష్, హెయిర్ స్ట్రేయిటెనర్స్, హెయిర్ డ్రయర్స్‌ను భారత్‌లో విక్రయిస్తోంది. మేధో సంపత్తి హక్కుల కొనుగోలుతో బజాజ్ ఎలక్ట్రికల్ భారత్ సహా నిర్దేశిత మార్కెట్లలో మర్ఫీ రిచర్డ్స్ బ్రాండ్ హక్కులపై పూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉండనుంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి