Coal India: కోల్ ఇండియా సారథిగా సాయిరామ్
ABN , Publish Date - Sep 22 , 2025 | 05:11 AM
ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తి దిగ్గజం కోల్ ఇండి యా లిమిటెడ్ (సీఐఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బీ. సాయిరామ్ ఎంపికయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థల...
తెలుగోడికి అత్యున్నత పదవి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తి దిగ్గజం కోల్ ఇండి యా లిమిటెడ్ (సీఐఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బీ. సాయిరామ్ ఎంపికయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థల అధిపతుల ఎంపిక బోర్డు (పీఈఎ్‌సబీ) ఈ పదవికి ఆయన పేరును సిఫారసు చేసింది. మరో 10 మంది నుంచి గట్టి పోటీ ఎదుర్కొని మౌఖిక పరీక్షలో అందరి కన్నా ముందు వరుసలో సాయిరామ్ నిలిచారు. ప్రస్తుతం సీఐఎల్‌కు సారథ్యం వహిస్తున్న పీఎం ప్రసాద్ అక్టోబరు 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. లాంఛనాలు పూర్తయిన తర్వాత ఆయన స్థానంలో సాయిరామ్ బాధ్యతలు చేపట్టనున్నారు. విశాఖపట్నానికి చెందిన సాయిరామ్ తన 34 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో టెక్నికల్ డైరెక్టర్ సహా ఎన్నో కీలక పదవులు నిర్వహించారు. ప్రస్తుతం నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ సీఎండీగా పని చేస్తున్నారు. ఆయనకు బొగ్గు రంగంలో అపారమైన అనుభవం ఉంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి