Share News

అరబిందో చైనా ప్లాంట్‌ నుంచి యూర్‌పకు ఉత్పత్తుల సరఫరా

ABN , Publish Date - Feb 17 , 2025 | 03:18 AM

అరబిందో ఫార్మా చైనాలోని తన ప్లాంట్‌ నుంచి యూర్‌పకు ఉత్పత్తుల సరఫరాను ఏప్రిల్‌ నుంచి ప్రారంభించనుంది. అరబిందో ఫార్మా చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎ్‌ఫఓ)...

అరబిందో చైనా ప్లాంట్‌ నుంచి యూర్‌పకు ఉత్పత్తుల సరఫరా

ఏప్రిల్‌ నుంచి ప్రారంభం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అరబిందో ఫార్మా చైనాలోని తన ప్లాంట్‌ నుంచి యూర్‌పకు ఉత్పత్తుల సరఫరాను ఏప్రిల్‌ నుంచి ప్రారంభించనుంది. అరబిందో ఫార్మా చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎ్‌ఫఓ) సంతానమ్‌ సుబ్రమణియన్‌ ఈ విషయాన్ని తెలిపారు. 2024 నవంబరు చివరి వారంలో కంపెనీ చైనా ప్లాంట్‌లో కార్యకలాపాలను ప్రారంభించింది. ఉత్పత్తిని క్రమంగా పెంచుతోంది. ఈ యూనిట్‌లో తయారు చేసే ఉత్పత్తులను ప్రధానంగా యూరప్‌ మార్కెట్‌కు సరఫరా చేయనుంది. ఇందుకు యూరోపియన్‌ నియంత్రణ మండలి నుంచి అవసరమైన అనుమతులు కూడా లభించాయని సుబ్రమణియన్‌ వెల్లడించారు. ఈ ప్లాంట్‌ నుంచి అమెరికా మార్కెట్‌కు సరఫరా చేయనున్నట్లు, అందుకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అవసరమైన అనుమతులను కూడా పొందనున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే 2-3 ఏళ్లలో కంపెనీ ఆదాయంలో గణనీయ వాటా చైనా ప్లాంట్‌ నుంచి సమకూరవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

గోల్డ్‌ బాండ్లకు గుడ్‌బై..

ఎస్‌బీఐ రిటైల్ లోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లల్లో కోత!

గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు

మరిన్ని తెలుగు, బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 17 , 2025 | 03:18 AM