ATGC Biotech Joint Venture: లగ్జంబర్గ్ ఇండస్ట్రీసతో ఏటీజీసీ బయోటెక్ జాయింట్ వెంచర్
ABN , Publish Date - Dec 09 , 2025 | 06:17 AM
జెనోమ్ వేలీలో కార్యకలాపాలు సాగిస్తు న్న... ఫెరోమోన్, సెమియో కెమికల్ ఆధారిత పంట రక్షణ ఉత్పత్తుల విభాగంలోని ఏటీజీసీ బయోటెక్ కంపెనీ ఇజ్రాయెల్‌కు చెందిన...
హైదరాబాద్: జెనోమ్ వేలీలో కార్యకలాపాలు సాగిస్తు న్న... ఫెరోమోన్, సెమియో కెమికల్ ఆధారిత పంట రక్షణ ఉత్పత్తుల విభాగంలోని ఏటీజీసీ బయోటెక్ కంపెనీ ఇజ్రాయెల్‌కు చెందిన లగ్జంబర్గ్ ఇండస్ట్రీ్‌సతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసుకున్నట్టు ప్రకటించింది. న్యూఢిల్లీలో జరిగిన తొలి అంతర్జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ల సదస్సు ముగింపు కార్యక్రమంలో ఈ లైసెన్సింగ్ ఒప్పందాల మార్పిడి జరిగింది. ఈ సెమియోఫోర్ జేవీకి అవసరమయ్యే కోటి డాలర్ల (రూ.89 కోట్లు) పెట్టుబడిని సెమీయోఫోర్, లగ్జంబర్గ్ ఇండస్ర్టీస్, ఏటీజీసీ బయోటెక్ సమంగా సమకూరుస్తాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఒప్పందం కింద ఏటీజీసి ఐపీ, టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం, రెగ్యులేటరీ, ఆర్ అండ్ డీలపై దృష్టి పెడుతుంది. లగ్జంబర్గ్ ఇండస్ర్టీస్ రెగ్యులేటరీ, మార్కెటింగ్, తయారీ వ్యయాలను భరిస్తుంది.
ఇవీ చదవండి:
ఏఐతో లేఆఫ్స్ భయాలు.. ఐబీఎమ్ సీఈఓ కీలక కామెంట్స్
ఎస్‌ఐపీ పెట్టుబడుల ఆకర్షణలో పడి ఈ తప్పు చేయొద్దు.. ఓ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అధికారి సూచన
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి