Aster DM Healthcare: రమేశ్ కార్డియాక్ హాస్పిటల్‌లో ఆస్టర్ హెల్త్‌కేర్‌కు మరింత వాటా
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:01 AM
బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ లిమిటెడ్.. విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న డాక్టర్ రమేశ్ కార్డియాక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్...
రూ.63 కోట్లతో 13 శాతం వాటా కొనుగోలు
న్యూఢిల్లీ: బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ లిమిటెడ్.. విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న డాక్టర్ రమేశ్ కార్డియాక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ (డీఆర్‌సీఎంహెచ్‌పీఎల్) ఈక్విటీలో మరింత వాటా పెంచుకుంది. ప్రస్తుతం ఈ హాస్పిటల్ ఈక్విటీలో ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్‌కు 57.49 శాతం వాటా ఉంది. తాజాగా రమేశ్ కార్డియాక్ హాస్పిటల్ ప్రమోటర్ల నుంచి మరో 13 శాతం వాటాను రూ.63.01 కోట్లకు చేసినట్లు ఆస్టర్ వెల్లడించింది. ఈ కొనుగోలుతో రమేశ్ హాస్పిటల్‌లో వాటా 70.49 శాతానికి చేరుకుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అభివృద్ధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. డీఆర్‌సీఎంహెచ్‌పీఎల్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 739 పడకల సామర్థ్యం కలిగిన ఐదు హాస్పిటల్స్‌ను నిర్వహిస్తోంది. కాగా 75 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఒంగోలు హాస్పిటల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ, తృతీయ త్రైమాసికంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
కిందిస్థాయి ఉద్యోగితో ఎఫైర్.. నెస్లే సీఈఓ తొలగింపు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి