Share News

Arattai downloads: దూసుకెళ్తున్న అరట్టై యాప్.. 75 లక్షల డౌన్‌లోడ్స్..

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:04 PM

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్. మెటా ఆధ్వర్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్‌నకు అంతర్జాతీయవ్యాప్తంగా ఆదరణ ఉంది. మనదేశంలో కూడా అత్యధికులు వాట్సాప్‌నే వినియోగిస్తుంటారు.

Arattai downloads: దూసుకెళ్తున్న అరట్టై యాప్.. 75 లక్షల డౌన్‌లోడ్స్..
Arattai app

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్. మెటా ఆధ్వర్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్‌నకు అంతర్జాతీయవ్యాప్తంగా ఆదరణ ఉంది. మనదేశంలో కూడా అత్యధికులు వాట్సాప్‌నే వినియోగిస్తుంటారు. అయితే దేశీయ ఐటీ సంస్థ జోహో తాజాగా అభివృద్ధి చేసిన మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అరట్టై. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అరట్టైను (Arattai app) ఉపయోగించాల్సిందిగా పలువురు కేంద్ర మంత్రులు, సెలబ్రిటీలు, కంపెనీల సీఈవోలు ప్రచారం చేస్తున్నారు.


ఈ ప్రచారం ప్రభావం వల్ల అరట్టై దూసుకెళ్లిపోతోంది. గత శుక్రవారానికి ఈ యాప్‌ను 75 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఒక దేశీయ యాప్ ఇంత వేగంగా ఈ స్థాయి ఆదరణ పొందడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ఈ యాప్‌నకు సంబంధించిన గణాంకాలను తాజాగా వెల్లడించారు. ఈ నెల 3వ తేదీ నాటికి ఈ యాప్‌ను 75 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపారు. గూగూల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌‌లో ఈ యాప్‌కు విశేష ఆదరణ లభిస్తోంది (Indian WhatsApp alternative).


అరట్టై అంటే తమిళంలో సరదాగా మాట్లాడుకోవడం అని అర్థం. ఆ తమిళ పదాన్ని ఈ యాప్‌నకు పెట్టారు (Arattai social media trend). వాట్సాప్‌నకు పోటీగా తీసుకొచ్చిన ఈ యాప్‌నకు కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, పియూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తదితరులు మద్దతు ప్రకటించారు. వాట్సాప్‌తో పాటు పలు సామాజిక మాధ్యమాల ద్వారా అరట్టైకు సంబంధించిన లింక్‌లు విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నాయి.


ఇవీ చదవండి:

లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 06 , 2025 | 12:04 PM