Apple Launches iPhone 17 Series: ఐఫోన్ 17 వచ్చేసిందోచ్
ABN , Publish Date - Sep 10 , 2025 | 02:00 AM
అమెరిక్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 17 సిరీ్‌సను మంగళవారం ప్రపంచానికి పరిచయం చేసింది. కాలిఫోర్నియా, కపర్టినోలోని యాపిల్ పార్క్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ఈ...
నాలుగు వేరియంట్లలో లభ్యం
ప్రారంభ ధర రూ.79,900
గరిష్ఠ రేటు రూ.1,49,900
కుపర్టినో(కాలిఫోర్నియా): అమెరిక్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 17 సిరీ్‌సను మంగళవారం ప్రపంచానికి పరిచయం చేసింది. కాలిఫోర్నియా, కపర్టినోలోని యాపిల్ పార్క్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ఈ ఫోన్లను ఆవిష్కరించారు. మొత్తం నాలుగు వేరియంట్లలో (17, 17 ఎయిర్, 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్) లభ్యం కానున్నాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చి, సుంకాల మోత మోగిస్తున్న తరుణంలో కంపెనీ ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేస్తున్న కొత్త ఐఫోన్ సిరీస్ ఇదే. ఇందులో ఐఫోన్ 17, 17 ఎయిర్ బుకింగ్ ఈనెల 12 నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 19 నుంచి స్టోర్లలోకి అందుబాటులోకి వస్తాయి. 17 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లు కూడా 19 నుంచి స్టోర్లలో లభ్యమవుతాయని సంస్థ తెలిపింది. యాపిల్ కొత్త ఐఫోన్‌తోపాటు యాపిల్ వాచ్ 11 సిరీ్‌సను, ఎయిర్‌పాడ్స్ 5, ఎయిర్‌పాడ్ ప్రో 3ను సైతం లాంచ్ చేసింది. వీటిని తక్షణమే బుక్ చేసుకోవచ్చు. ఈనెల 19 నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి.
ఎయిర్‌పాడ్ ప్రో 3: ప్రపంచంలో అత్యుత్తమ నాయిస్ క్యాన్సిలేషన్ సాంకేతికతతోపాటు లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌తో కూడిన ఎయిర్‌పాడ్ ప్రో 3 ధర 249 డాలర్లు.
యాపిల్ వాచ్ సిరీస్ 11: బిల్ట్ ఇన్ 5జీ కనెక్టివిటీ, హైపర్ టెన్షన్ అలర్ట్స్(రక్తపోటు హెచ్చరికలు), స్లీప్ స్కోర్ వంటి కొత్త ఫీచర్లతో కూడిన యాపిల్ వాచ్ 11 సిరీస్ ధర 399 డాలర్లు. 24 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. యాపిల్ వాచ్ ఎస్‌ఈ 3, అలా్ట్ర 3 మోడళ్లను కూడా ప్రవేశపెట్టింది సంస్థ. ఎస్10 ప్రాసెసర్‌తో కూడిన ఎస్‌ఈ 3 వాచ్ నిరంత డిస్‌ప్లే, స్లీప్ స్కోర్, వర్కవుట్ బడ్డీ, టెంపరేచర్ సెన్సింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. దీని ధర 249 డాలర్లు. శాటిలైట్ కనెక్టివిటీతో కూడిన అలా్ట్ర 3 ధర 799 డాలర్లుగా ఉంది.
స్ర్కీన్ సైజు ప్రారంభ ధర
అంగుళాలు డాలర్లు రూ.
ఐఫోన్ 17 6.3 799 82,900
ఐఫోన్ 17 ఎయిర్ 6.5 999 1,19,900
ఐఫోన్ 17 ప్రో 6.3 1,099 1,34,900
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 6.9 1,199 1,49,900
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి