Apple Expands in WaveRock Tower: హైదరాబాద్‌లో యాపిల్ విస్తరణ
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:04 AM
ఐఫోన్ తయారీ దిగ్గజం యాపిల్ హైదరాబాద్‌లో కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందుకోసం నానక్‌రామ్ గూడ, ఐటీ కారిడార్‌లోని వేవ్‌రాక్ టవర్ 2.1 లో 64,125 చదరపు అడుగుల...
మరో 64,125 చదరపు అడుగుల
ఆఫీస్ స్పేస్ లీజుకు తీసుకున్న సంస్థ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఐఫోన్ తయారీ దిగ్గజం యాపిల్ హైదరాబాద్‌లో కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందుకోసం నానక్‌రామ్ గూడ, ఐటీ కారిడార్‌లోని వేవ్‌రాక్ టవర్ 2.1 లో 64,125 చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని (ఆఫీస్ స్పేస్)ను ఐదేళ్ల కాలానికి లీజుకు తీసుకుందని రియల్టీ రంగానికి చెందిన డేటా, అనలిటిక్స్ కంపెనీ ప్రాప్‌స్టాక్ వెల్లడించింది. టీఎ్‌సఐ బిజినెస్ పార్క్స్ (హైదరాబాద్) ప్రైవేట్ లిమిటెడ్ నుంచి లీజుకు తీసుకున్న ఈ స్థలం కోసం యాపిల్ ఇండియా నెలకు రూ.80.15 లక్షల అద్దె చెల్లించనున్నట్లు ప్రాప్‌స్టాక్ తెలిపింది. యాపిల్ హైదరాబాద్ ఆఫీ్‌సను సీఈఓ టిమ్ కుక్ 2016 మే నెలలో ప్రారంభించారు. సంస్థ ఇక్కడ యాపిల్ మ్యాప్స్, జియో స్పేషియల్ టెక్నాలజీ, డేటా మోడలింగ్ అభివృద్ధి కార్యకలాపాలు సాగిస్తోంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
కిందిస్థాయి ఉద్యోగితో ఎఫైర్.. నెస్లే సీఈఓ తొలగింపు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి