Share News

Apollo Hospitals Expands: ఇరాక్‌లో అపోలో వైద్య సేవలు

ABN , Publish Date - Sep 28 , 2025 | 06:09 AM

అపోలో హాస్పిటల్స్‌ తన వైద్య సేవలను ఇరాక్‌కు విస్తరిస్తోంది. ఇందుకోసం ఆ దేశానికి చెందిన అంతర్గత మంత్రిత్వ శాఖతో ఒక వ్యూహాత్మక ఒప్పందం...

Apollo Hospitals Expands: ఇరాక్‌లో అపోలో వైద్య సేవలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అపోలో హాస్పిటల్స్‌ తన వైద్య సేవలను ఇరాక్‌కు విస్తరిస్తోంది. ఇందుకోసం ఆ దేశానికి చెందిన అంతర్గత మంత్రిత్వ శాఖతో ఒక వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా అపోలో హాస్పిటల్స్‌.. ఇరాక్‌ అంతర్గత భద్రతా దళాల హాస్పిటల్‌ నిర్వహణ చేపట్టడంతో పాటు ఆ దేశ భద్రతా దళాలు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన అత్యాధునిక వైద్య సేవలు అందిస్తుందని అపోలో జాయింట్‌ ఎండీ సంగీతా రెడ్డి తెలిపారు. కాగా ‘హీల్‌ ఇన్‌ ఇండియా, హీల్‌ బై ఇండియా, హీల్‌ ఫ్రమ్‌ ఇండియా’ అనే తమ నినాదంలో భాగంగా తమ వైద్య సేవలను ఇరాక్‌కు విస్తరిస్తున్నట్టు అపోలో హాస్పిటల్స్‌ వ్యవస్థాపక చైర్మన్‌ ప్రతాప్‌ సీ రెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి:

Allianz Global Wealth Report 2025: కుటుంబాల సంపద మరింత పైకి

Pharma Stocks Plunge: ఫార్మా సుంకాల షాక్‌

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 28 , 2025 | 06:09 AM