Unispace megastore Hyderabad: హైదరాబాద్‌లో యునిస్పేస్ మెగాస్టోర్
ABN , Publish Date - Sep 04 , 2025 | 05:22 AM
నిర్మాణ, నిర్మాణ పరికరాల రంగంలోని అపర్ణా ఎంటర్‌ప్రైజెస్ (ఏఈఎల్) హైదరాబాద్‌లోని మియాపూర్‌లో యునిస్పేస్ మెగాస్టోర్‌ను ప్రారంభించింది. ఇది ఆసియాలోనే అతి పెద్ద స్టోర్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్) : నిర్మాణ, నిర్మాణ పరికరాల రంగంలోని అపర్ణా ఎంటర్‌ప్రైజెస్ (ఏఈఎల్) హైదరాబాద్‌లోని మియాపూర్‌లో యునిస్పేస్ మెగాస్టోర్‌ను ప్రారంభించింది. ఇది ఆసియాలోనే అతి పెద్ద స్టోర్ అని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. తమ రిటైల్ విస్తరణలో భాగంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లో కూడా ఇదే తరహా స్టోర్లు ప్రారంభించాలనుకుంటున్నట్టు చెప్పారు. భవన నిర్మాణంలో ఉపయోగించే 20 రకాల వస్తువులకు ఇది వన్ స్టాప్ సొల్యూషన్‌గా ఉంటుందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ శ్రేయాస్ త్రివేది వెల్లడించారు. కస్టమర్లకు ఇంటి డిజైన్, నిర్మాణం, ఆధునీకరణ వంటి సేవలన్నీ ఒకే ఛత్రం కింద అందించాలన్నది తమ కాన్సెప్ట్ అని ఆయన చెప్పారు. ఇది కస్టమర్లకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి