Share News

IPO News India: ఈ వారం మరో 13 ఐపీఓలు

ABN , Publish Date - Dec 08 , 2025 | 02:29 AM

ప్రైమరీ మార్కెట్లో పబ్లిక్‌ ఆఫరింగ్‌(ఐపీఓ)ల జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఐపీఓల ద్వారా కంపెనీలు సమీకరించిన నిధులు దాదాపు రూ.85,000 కోట్లకు చేరాయి....

IPO News India: ఈ వారం మరో 13 ఐపీఓలు

  • ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.85,000 కోట్ల సమీకరణ

న్యూఢిల్లీ: ప్రైమరీ మార్కెట్లో పబ్లిక్‌ ఆఫరింగ్‌(ఐపీఓ)ల జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఐపీఓల ద్వారా కంపెనీలు సమీకరించిన నిధులు దాదాపు రూ.85,000 కోట్లకు చేరాయి. ఈ వారం మరో 13 కంపెనీలు (మెయిన్‌బోర్డ్‌, ఎస్‌ఎంఈ కలిపి) రూ.13,807 కోట్ల సమీకరణ కోసం ఐపీఓకు వస్తున్నాయి. ఇందులో వేక్‌ఫిట్‌ ఇన్నోవేషన్స్‌ రూ.1,289 కోట్ల ఐపీఓ సోమవారం ప్రారంభమవుతోంది. ఇందుకోసం ఒక్కో షేరును రూ.185-195 ప్రైస్‌ బ్యాండ్‌లో జారీ చేస్తోంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ సైతం ఈవారంలోనే ఆఫర్‌ను ప్రారంభించనుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.10,603 కోట్లు సమీకరించనుంది. షేరు ధరల శ్రేణిని కంపెనీ రూ.2,061-2,165గా నిర్ణయించింది. ఈ ఐపీఓ 12న ప్రారంభమై16న ముగుస్తుంది.

ఇవీ చదవండి:

ఎస్‌ఐపీ పెట్టుబడుల ఆకర్షణలో పడి ఈ తప్పు చేయొద్దు.. ఓ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అధికారి సూచన

భారత సంతతి వ్యక్తికి యాపిల్ సంస్థలో కీలక బాధ్యతలు

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 08 , 2025 | 02:29 AM