Share News

Andhra Pradesh to Start Gold Production: త్వరలో జొన్నగిరి గని నుంచి పసిడి ఉత్పత్తి

ABN , Publish Date - Sep 19 , 2025 | 05:41 AM

ఆంధ్రప్రదేశ్‌ త్వరలో దేశ పసిడి ఉత్పత్తి మ్యాప్‌లో చేరబోతోంది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి వద్ద దక్కన్‌ గోల్డ్‌ మైన్స్‌ లిమిటెడ్‌ (డీజీఎంఎల్‌) కంపెనీ అభివృద్ధి చేస్తున్న గనిలో అతి త్వరలో...

Andhra Pradesh to Start Gold Production: త్వరలో జొన్నగిరి గని నుంచి పసిడి ఉత్పత్తి

  • నాలుగేళ్లలో ఏటా 1,000 టన్నులు

  • దక్కన్‌ గోల్డ్‌మైన్స్‌ ఎండీ హనుమ ప్రసాద్‌

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ త్వరలో దేశ పసిడి ఉత్పత్తి మ్యాప్‌లో చేరబోతోంది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి వద్ద దక్కన్‌ గోల్డ్‌ మైన్స్‌ లిమిటెడ్‌ (డీజీఎంఎల్‌) కంపెనీ అభివృద్ధి చేస్తున్న గనిలో అతి త్వరలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఢిల్లీలో సీఐఐ నిర్వహించిన ఒక సదస్సుకు హాజరైన డీజీఎంఎల్‌ ఎండీ హనుమ ప్రసాద్‌ ఈ విషయం వెల్లడించారు. ఈ ఏడాది జూన్‌-జూలై నెలల్లో ఈ ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ అనుమతులు లభించాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసిన అనుమతులు కూడా లభిస్తే త్వరలోనే జొన్నగిరి గని నుంచి పసిడి ఉత్పత్తి ప్రారంభిస్తామని ప్రసాద్‌ చెప్పారు. ఇదే జరిగితే మన దేశంలో గనుల నుంచి పసిడి తీసే తొలి ప్రైవేట్‌ కంపెనీగా డీజీఎంఎల్‌ రికార్డు సృష్టించనుంది. కాగా ప్రారంభంలో జొన్నగిరి గని నుంచి ఏటా 750 కిలోల పసిడి ఉత్పత్తి చేయవచ్చని డీజీఎంఎల్‌ భావిస్తోంది. తర్వాత రెండు-మూడు సంవత్సరాల్లో ఇది 1,000 టన్నులకు చేరే అవకాశం ఉందని ప్రసాద్‌ తెలిపారు.

ప్రస్తుతం మన దేశంలో ఏటా 1.5 టన్నులకు మించి పసిడి ఉత్పత్తి కావడం లేదు. దీంతో పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం ఖర్చు చేసి ఏటా దాదాపు 1,000 టన్నుల పసిడి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. జొన్నగిరి గనుల్లో డీజీఎంఎల్‌ పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తే ఈ భారం భారీగా తగ్గనుంది.

  • న్యూమరస్‌ మోటార్స్‌ మార్కెట్లోకి మల్టీ యుటిలిటీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ డిప్లోస్‌ మాక్స్‌ ప్లస్‌ వెర్షన్‌ను విడుదల చేసింది. 4.0 కిలోవాట్‌ కూలింగ్‌ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఈ స్కూటర్‌ 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మూడు రంగుల్లో అందుబాటులో ఉండే ఈ స్కూటర్‌ ధర రూ.1.15,103.

  • యమహా మోటార్‌ ఇండియా నవరాత్రుల సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా ద్విచక్ర వాహన శ్రేణిపై ప్రత్యేక బీమా ప్రయోజనాలతో పాటు రేజర్‌ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌ స్కూటర్‌పై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను అందిస్తోంది. అలాగే జీఎస్‌టీ ప్రయోజనాలను అందిస్తున్నట్లు ప్రకటించింది.

  • మెడ్‌టెక్‌ సంస్థ మెరిల్‌.. భారత్‌లోకి అడ్వాన్స్‌డ్‌ సాఫ్ట్‌ టిష్యూ రోబోటిక్‌ సిస్టమ్‌ ‘మిజ్జో ఎండో 4,000’ను తీసుకువచ్చింది. గైనకాలజీ, యూరాలజీ, బేరియాట్రిక్‌ తదితర వ్యాధుల చికిత్సలో మిజ్జో ఎండో కీలకంగా ఉండనుంది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 19 , 2025 | 05:41 AM