Share News

Aircel Maxis Case: ఎయిర్‌సెల్‌ కేసులో మ్యాక్సిన్‌కు మళ్లీ సమన్లు

ABN , Publish Date - Sep 22 , 2025 | 04:52 AM

ఎయిర్‌సెల్‌-మ్యాక్సిన్‌ లంచాల కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మరోసారి మలేషియా కేంద్రంగా పనిచేసే టెలికాం దిగ్గజం మ్యాక్సి్‌సకు నోటీసులు జారీ చేసింది....

Aircel Maxis Case: ఎయిర్‌సెల్‌ కేసులో మ్యాక్సిన్‌కు మళ్లీ సమన్లు

న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్‌-మ్యాక్సిన్‌ లంచాల కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మరోసారి మలేషియా కేంద్రంగా పనిచేసే టెలికాం దిగ్గజం మ్యాక్సి్‌సకు నోటీసులు జారీ చేసింది. మ్యాక్సిన్‌తో పాటు దాని డైరెక్టర్‌ ఆగస్టస్‌ రాల్ఫ్‌ మార్షల్‌, మ్యాక్సిస్‌ కంపెనీ అనుబంధ సంస్థ ఆస్ట్రో ఆల్‌ ఏషియా నెట్‌వర్క్‌కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను వీరికి అందజేసేందుకు మూడు నెలల సమయం కావాలని సీబీఐ కోరింది. యూపీఏ హయాంలో ఎయిర్‌సెల్‌ ఈక్విటీలో తన వాటాను 26 శాతం నుంచి 73.99 శాతానికి పెంచుకునేందుకు అప్పటి ఆర్థిక మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరానికి మ్యాక్సిస్‌ పెద్దఎత్తున లంచాలు ముట్టచెప్పిందని ఆరోపణ. ఈ ఆరోపణలపై 2006లోనే సీబీఐ వీరిపై చార్జిషీట్‌ ఫైల్‌ చేసింది. దాని ఆధారంగా కోర్టు 2015లోనే నోటీసులు జారీ చేసినా వారు వాటిని స్వీకరించలేదు. దాంతో సీబీఐ అభ్యర్థనపై కోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 22 , 2025 | 05:07 AM