N Chandrasekaran: ఎయిరిండియా మా బాధ్యత కూడా
ABN , Publish Date - Nov 30 , 2025 | 05:45 AM
టాటా గ్రూప్‌నకు ‘‘ఎయిరిండియా కేవలం వ్యాపార అవకాశం మాత్రమే కాదు. బాధ్యత కూడా’’ అని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. విమానయాన రంగంలో...
టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్
ముంబై: టాటా గ్రూప్‌నకు ‘‘ఎయిరిండియా కేవలం వ్యాపార అవకాశం మాత్రమే కాదు. బాధ్యత కూడా’’ అని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. విమానయాన రంగంలో సవాళ్లు కొనసాగుతున్నాయని, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలోని సమస్యలు విమానాల విడిభాగాలు, మౌలిక సదుపాయాలు, కొత్త విమానాల లభ్యతను అనిశ్చితిలోకి నెట్టాయన్నారు. టాటా గ్రూప్ వ్యవస్థాపకులు జేఆర్‌డీ టాటా 121వ జయంతి కార్యక్రమంలో చంద్రశేఖరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దాదాపు ఏడు దశాబ్దాల పాటు ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఎయిరిండియాను 2022 జనవరిలో రూ.18,000 కోట్లకు టాటా సన్స్ దక్కించుకుంది. అప్పటి నుంచి ఎయిరిండియాను ప్రపంచ స్థాయి ఎయిర్‌లైన్స్‌గా తీర్చిదిద్దేందుకు టాటా గ్రూప్ తీవ్ర కసరత్తు చేస్తోంది.
ఇవీ చదవండి:
విదేశీ ఆస్తులు వెల్లడించని 25 వేల మందిపై ఐటీ శాఖ దృష్టి.. మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా?
లాభాల స్వీకరణతో మార్కెట్లు డౌన్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి