AHPI Urges Star Health: క్యాష్‌లెస్ సేవలు పునరుద్ధరించాలి
ABN , Publish Date - Sep 16 , 2025 | 05:11 AM
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు.. సంస్థ నెట్‌వర్క్ హాస్పిటల్స్ మధ్య వివాదం మరింత ముదిరింది. తన నెట్‌వర్క్‌లోని కొన్ని హాస్పిటల్స్‌లో నగదు రహిత (క్యాష్‌లెస్) వైద్య సేవలను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నిలిపి...
స్టార్ హెల్త్‌కు ఏహెచ్‌పీఐ వినతి
న్యూఢిల్లీ: స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు.. సంస్థ నెట్‌వర్క్ హాస్పిటల్స్ మధ్య వివాదం మరింత ముదిరింది. తన నెట్‌వర్క్‌లోని కొన్ని హాస్పిటల్స్‌లో నగదు రహిత (క్యాష్‌లెస్) వైద్య సేవలను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నిలిపి వేయడంపై అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా (ఏహెచ్‌పీఐ) తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. వెంటనే ఈ సేవలను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. స్టార్ హెల్త్ నిర్ణయంతో రోగులు నగదు రహిత సేవలు అందక మానసిక, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. ఈ ప్రభావం వైజాగ్‌లోని రాంనగర్‌లో ఉన్న కేర్ హాస్పిటల్‌పైనా పడింది. క్లెయిమ్స్‌కు సంబంధించిన వివాదాలతో స్టార్ హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్ రెండు రోజుల క్రితం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే ఈ వార్తలపై స్టార్ హెల్త్ అధికారికంగా నోరు మెదపడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్
భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
For AP News And Telugu News
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు.. సంస్థ నెట్‌వర్క్ హాస్పిటల్స్ మధ్య వివాదం మరింత ముదిరింది. తన నెట్‌వర్క్‌లోని కొన్ని హాస్పిటల్స్‌లో నగదు రహిత (క్యాష్‌లెస్) వైద్య సేవలను స్టార్ హెల్త్