Adani Group: హిండెన్‌బర్గ్ నివేదిక భారత సంస్థలపై దాడి
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:11 AM
అమెరికన్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలోని ఆరోపణలను దేశీయ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తోసిపుచ్చడం తమ గ్రూప్ పాలన విధానాలు..
న్యూఢిల్లీ: అమెరికన్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలోని ఆరోపణలను దేశీయ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తోసిపుచ్చడం తమ గ్రూప్ పాలన విధానాలు, పారదర్శకతకు బలమైన సమర్థన అని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. ఎట్టకేలకు నిజం గెలిచిందని గ్రూప్ వాటాదారులకు బుధవారం రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. హిండెన్‌బర్గ్ నివేదిక కేవలం అదానీ గ్రూప్‌పై జరిగిన దాడి మాత్రమే కాదు.. ప్రపంచ స్థాయిలో విస్తరించాలని కలలు కనే భారత సంస్థల ధైర్యసాహసాలకు ప్రత్యక్ష సవాలు అని గౌతమ్ అదానీ అన్నారు. తమను బలహీనపరిచే దురుద్దేశంతో విడుదల చేసిన నివేదిక.. గ్రూప్ పునాదులను మరింత బలోపేతం చేసిందటూ గడిచిన రెండేళ్లలో గ్రూప్ ఆర్థిక పురోగతిని అదానీ ఆ లేఖలో ప్రస్తావించారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి