ACs and Dishwashers Prices Slashed: తగ్గిన ఏసీలు డిష్‌వాషర్ల ధరలు
ABN , Publish Date - Sep 21 , 2025 | 05:16 AM
రూమ్ ఎయిర్ కండీషనర్లు (ఏసీలు), డిష్‌వాషర్స్ ధరలను గణనీయంగా తగ్గించినట్లు ఎలకా్ట్రనిక్స్, గృహోపకరణ తయారీ సంస్థలు ప్రకటించాయి. ఈ ఉత్పత్తులపై జీఎ్‌సటీని ప్రభుత్వం 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించటంతో...
రూ.4,500, రూ.8,000 వరకు తగ్గించిన కంపెనీలు
న్యూఢిల్లీ: రూమ్ ఎయిర్ కండీషనర్లు (ఏసీలు), డిష్‌వాషర్స్ ధరలను గణనీయంగా తగ్గించినట్లు ఎలకా్ట్రనిక్స్, గృహోపకరణ తయారీ సంస్థలు ప్రకటించాయి. ఈ ఉత్పత్తులపై జీఎ్‌సటీని ప్రభుత్వం 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించటంతో ఆ మేరకు పన్ను ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేసినట్లు కంపెనీలు వెల్లడించాయి. రూమ్ ఏసీ ధరలను గరిష్ఠంగా రూ.4,500 వరకు, డిష్‌వాషర్స్ ధరలను రూ.8,000 వరకు తగ్గించినట్లు కంపెనీలు వెల్లడించాయి. ఈ నెల 22 నుంచి తగ్గించిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపాయి. ధరల తగ్గింపుతో పండగ సీజన్‌లో విక్రయాల్లో రెండంకెల వృద్ధి చేసే నమోదు చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏసీ, డిష్ వాషర్స్ తయారీ కంపెనీలైన వోల్టాస్, డైకిన్, గోద్రెజ్ అప్లయెన్సెస్, పానాసోనిక్, హాయర్ వంటి ప్రధాన బ్రాండ్లు ఇప్పటికే సవరించిన జాబితాను విడుదల చేశాయి.
ఎంత తగ్గాయంటే..
వోల్టాస్ ఫిక్స్‌డ్ స్పీడ్ విండో ఏసీ ధరను రూ. 42,900 నుంచి రూ. 39,590కి, ఇన్వర్టర్ విండో ఏసీ ధరను రూ. 46,990 నుంచి రూ. 43,290కి తగ్గించగా, డైకిన్ ఒక టన్ను 5 స్టార్ ఇన్వర్టర్ ఏసీ ధర రూ. 20,500 నుంచి రూ. 18,890కి తగ్గించింది. ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్ తన ఎంట్రీ లెవెల్ 1 టన్ను 3 స్టార్ ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీని రూ. 32,890గా నిర్ణయించగా, 2 టన్నుల మోడల్ ధరను రూ. 55,490కి తగ్గించింది. హాయర్ 1.6 టన్నుల గ్రావిటీ ఇన్వర్టర్ ఏసీ ధరను రూ. 46,085గా సవరించింది. గోద్రెజ్ అప్లయెన్సెస్ క్యాసెట్, టవర్ ఏసీల ధరలను రూ. 8,550 నుంచి రూ. 12,450 వరకు తగ్గించింది.
డిష్‌వాషర్ విభాగంలో: బీఎ్‌సహెచ్ హోమ్ అప్లయెన్సెస్ తన ఎంట్రీ లెవెల్ డిష్‌వాషర్ ధరను రూ.49,000 నుంచి రూ.45,000కి తగ్గించగా, ప్రీమియం మోడల్ ధరను రూ. 1,04,500 నుంచి రూ. 96,500కి తగ్గించింది. వోల్టాస్- బెకో తన ఎంట్రీ లెవెల్ మోడల్ ధరను రూ.25,900 నుంచి రూ. 23,390కి కుదించింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు
మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్
Read Latest Telangana News And Telugu News