Urban Company IPO: పెట్టుబడి రూ 55 కోట్లు వచ్చింది రూ 2437 కోట్లు
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:22 AM
అర్బన్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ.. మదుపరులకు భారీ లాభాలను అందించింది. బుధవారం స్టాక్ మార్కెట్లో లిస్టయిన అర్బన్ కంపెనీ ప్రారంభించిన సమయంలో పెట్టుబడులు పెట్టిన మదుపరులకైతే...
అర్బన్ ఐపీఓలో ‘యాక్సెల్’కు జాక్‌పాట్
ముంబై: అర్బన్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ.. మదుపరులకు భారీ లాభాలను అందించింది. బుధవారం స్టాక్ మార్కెట్లో లిస్టయిన అర్బన్ కంపెనీ ప్రారంభించిన సమయంలో పెట్టుబడులు పెట్టిన మదుపరులకైతే బంపర్ లాభాలు వచ్చాయి. పదేళ్ల క్రితం వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థ యాక్సెల్.. అర్బన్ కంపెనీ ఈక్విటీలో ఒక్కో షేరును రూ.3.77 చొప్పున రూ.55 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది. తాజాగా బుధవారం కంపెనీ షేరు బీఎ్‌సఈలో ఇష్యూ ధర రూ.103తో పోల్చితే 56.31ు ప్రీమియంతో రూ.161 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో ఏకంగా 73.78ు లాభపడి రూ.179 స్థాయిని తాకింది. చివరికి 62.18ు లాభంతో రూ.167.05 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.23,986.74 కోట్లుగా నమోదైంది. కాగా ఈ లెక్కన అర్బన్ కంపెనీ ఈక్కిటీలో పదేళ్ల క్రితం యాక్సెల్ పెట్టిన పెట్టుబడుల విలువ ప్రస్తుతం ఏకంగా రూ.2,437 కోట్లకు చేరింది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ కేంద్రంగా పనిచేసే ఈ వీసీ గతంలో ఫేస్‌బుల్‌లోనూ పెట్టుబడి పెట్టి భారీ లాభాలు ఆర్జించింది.
రెండో రోజూ మార్కెట్లో ర్యాలీ
భారత-అమెరికా వాణిజ్య చర్చలపై నెలకొన్న ఆశావీచికలు, అమెరికన్ ఫెడ్‌రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాల నడుమ ఈక్విటీ మార్కెట్ బుధవారం వరుసగా రెండో రోజూ ర్యాలీని కొనసాగించింది. సెన్సెక్స్ 313.02 పాయిం ట్ల వృద్ధితో 82,693.71 వద్ద ముగిసింది. నిఫ్టీ 91.15 పాయింట్లు లాభపడి 25,330.25 వద్ద బలంగా క్లోజైంది. నిఫ్టీ 25,300కన్నా పైన నిలబడడం మార్కెట్లో సెంటిమెంట్ బలంగా ఉందనేందుకు సంకేతమని విశ్లేషకులంటున్నారు.
Also Read:
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ
దమ్ముంటే అలా చెయ్యండి.. సూర్యకుమార్ యాదవ్‌కు ఆప్ నేత సవాల్..
For More Latest News