GST Rate Cut: కొత్త జీఎస్‌టీ రేట్లతో కస్టమర్లకు వల
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:32 AM
వచ్చే సోమవారం నుంచి అమలులోకి రానున్న జీఎ్‌సటీ రేట్ల తగ్గింపును ముందుగానే వర్తింపచేస్తూ ఎయిర్ కండిషనర్ తయారీదారులు, డీలర్లు కస్టమర్ల నుంచి ముందస్తు బుకింగ్‌లు స్వీకరిస్తున్నారు...
తగ్గింపు ధరలతో ఏసీ బుకింగ్‌లు షురూ
న్యూఢిల్లీ: వచ్చే సోమవారం నుంచి అమలులోకి రానున్న జీఎ్‌సటీ రేట్ల తగ్గింపును ముందుగానే వర్తింపచేస్తూ ఎయిర్ కండిషనర్ తయారీదారులు, డీలర్లు కస్టమర్ల నుంచి ముందస్తు బుకింగ్‌లు స్వీకరిస్తున్నారు. జీఎ్‌సటీ రేట్ల తగ్గింపు ప్రభావంతో ఏసీలకు డిమాండు గణనీయంగా పెరుగుతుందన్న అంచనాతో వారు ఈ చర్య తీసుకున్నారు. తాము 10ు జీఎ్‌సటీ తగ్గింపు ప్రయోజనం మొత్తాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తున్నామని, మోడల్‌ను బట్టి ఒక్కో ఏసీపై కస్టమర్‌కు రూ.4,000 వరకు ధర తగ్గుతుందని రూమ్ ఎయిర్ కండిషనర్ తయారీదారులు చెప్పారు. ప్రస్తుతం ఏసీలపై 28ు జీఎ్‌సటీ విధిస్తుండగా కొత్త విధానం కింద దాన్ని 18 శాతానికి తగ్గించారు. బ్లూస్టార్, హాయర్ వంటి కంపెనీలు ఇప్పటికే ప్రీ బుకింగ్ ప్రారంభించాయి. వేసవి తీవ్రత అధికంగా ఉన్న సమయంలో అకాల వర్షాల కారణంగా జూన్ త్రైమాసికంలో ఏసీల డిమాండు గణనీయంగా తగ్గింది.
అంతేకాకుండా కస్టమర్లను ఆకర్షించేందుకు ఏసీ తయారీదారులు ఈజీ ఫైనాన్సింగ్, ఉచిత ఇన్‌స్టలేషన్, గ్యాస్ చార్జింగ్‌తో ఎక్స్‌టెండెడ్ వారెంటీ, జీరో కాస్ట్ ఈఎంఐ సదుపాయాలను తిరిగి ప్రారంభించాయి. ప్రీ బుకింగ్‌కు స్పందన బాగుందని, కొత్త జీఎ్‌సటీ రేట్లు అమలులోకి వచ్చే రోజు అంటే 22వ తేదీన వారికి బిల్లు జారీ చేయనున్నట్లు బ్లూస్టార్ ఎండీ త్యాగరాజన్ చెప్పారు.
టీవీలకు పెరగనున్న డిమాండ్
జీఎ్‌సటీ రేట్ల తగ్గింపుతో ఈ దీపావళి సీజన్‌లో తాము అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని సాధించగలమన్న విశ్వాసాన్ని ఎలక్ర్టానిక్స్ తయారీ దిగ్గజం సోనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ నయ్యర్ ప్రకటించారు. టీవీల ధరలు సగటున 7.5-8 శాతం తగ్గుతాయని ఆయన తెలిపారు. ప్రీమియం సెగ్మెంట్లో ఉన్న సోనీ కంపెనీ మోడల్‌ని బట్టి టీవీల ధర రూ.8,000-70,000 మధ్యలో తగ్గనున్నట్టు తెలిపింది.
అపోలో టైర్ల ధర తగ్గింపు
జీఎ్‌సటీ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తూ అపోలో టైర్స్ తమ టైర్ల ధరను రూ.300-2000 మధ్యలో తగ్గించినట్టు ప్రకటించింది. ప్రయాణికుల వాహన టైర్లయితే రూ.300-1500 మధ్యలో తగ్గాయని, ట్రక్కు/బస్సు రేడియల్ టైర్ల ధర రూ.2000 వరకు తగ్గించినట్టు తెలిపింది.
Also Read:
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ
దమ్ముంటే అలా చెయ్యండి.. సూర్యకుమార్ యాదవ్‌కు ఆప్ నేత సవాల్..
For More Latest News