Share News

2500 Employees Laid Off at TCS: టీసీఎస్‌‌లో 2500 మంది ఔట్‌

ABN , Publish Date - Oct 02 , 2025 | 05:31 AM

ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. టీసీఎస్‌ కంపెనీ పూణె యూనిట్‌లో 2,500 మందిని తీసివేసినట్టు జాతీయ స్థాయిలో ఐటీ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించే నాస్కెంట్‌ ఇన్ఫర్మేషన్‌...

2500 Employees Laid Off at TCS: టీసీఎస్‌‌లో 2500 మంది ఔట్‌

న్యూఢిల్లీ: ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. టీసీఎస్‌ కంపెనీ పూణె యూనిట్‌లో 2,500 మందిని తీసివేసినట్టు జాతీయ స్థాయిలో ఐటీ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించే నాస్కెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఉద్యోగుల సెనెట్‌ (ఎన్‌ఐటీఈఎ్‌స) మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని ఉద్యోగులను కాపాడాలని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు హర్‌ప్రీత్‌ సింగ్‌ సలూజా మహారాష్ట్ర సీఎం ఫడ్నవి్‌సకు లేఖ రాశారు. వీరిలో ఎక్కువ మంది 40 ఏళ్లు పైబడిన మిడ్‌, సీనియర్‌ ఉద్యోగులని తెలిపారు. ఇలా ఉన్నపళంగా వీరిని ఉద్యోగాల నుంచి తీసివేయడంతో వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. టీసీఎస్‌ మాత్రం ఈ వార్తల్లో నిజం లేదని పేర్కొంది. కంపెనీ అవసరాలకు తగ్గ సాంకేతిక నైపుణ్యాలు లేని అతి కొద్ది మంది ఉద్యోగులను మాత్రమే నిబంధనలకు అనుగుణంగా తొలగించామని పేర్కొంది. ఉద్యోగ సంఘాలు మాత్రం టీసీఎస్‌ ఇటీవల దేశవ్యాప్తంగా దాదాపు 30,000 మది ఉద్యోగులపై వేటువేసిందని చెబుతున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

పీఎంకు థ్యాంక్స్ చెప్పిన సీఎం

నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..

For More AP News And Telugu News

Updated Date - Oct 02 , 2025 | 05:32 AM