Share News

India AI Market: టెక్‌ ఏఐకు భారత్‌ అద్భుత మార్కెట్‌

ABN , Publish Date - Aug 25 , 2025 | 01:50 AM

టెక్నాలజీ, కృత్రిమ మేధ (ఏఐ)కు భారత్‌ అద్భుతమైన మార్కెట్‌ అని మైక్రోసాఫ్ట్‌ ఇండియా భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది లేదా ఏడాదిన్నరలో నూటికి 82 కంపెనీలు తమ ఉద్యోగులకు ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమవుతుంటే...

India AI Market: టెక్‌ ఏఐకు భారత్‌ అద్భుత మార్కెట్‌

  • ఏఐతో కొత్త రకం ఉద్యోగాలు

  • మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌ పునీత్‌ చందోక్‌

న్యూఢిల్లీ: టెక్నాలజీ, కృత్రిమ మేధ (ఏఐ)కు భారత్‌ అద్భుతమైన మార్కెట్‌ అని మైక్రోసాఫ్ట్‌ ఇండియా భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది లేదా ఏడాదిన్నరలో నూటికి 82 కంపెనీలు తమ ఉద్యోగులకు ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమవుతుంటే, భారత్‌లో మాత్రం 93 శాతం కంపెనీలు ఇందుకు సిద్దంగా ఉన్నట్టు సంస్థ ప్రెసిడెంట్‌ పునీత్‌ చందోక్‌ చెప్పారు. ఈ గిరాకీని తట్టుకునేందుకు పెద్దసంఖ్యలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, అప్లికేషన్స్‌ ఇంజనీర్లు అవసరమవుతారన్నారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌ కోడింగ్‌లో 30 శాతం ఏఐ ద్వారానే రాస్తున్నట్టు తెలిపారు. భారత్‌లో తమ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఏఐలో 300 కోట్ల డాలర్లు పెట్టుబడి పెడుతున్నట్టు తెలిపారు.

ఏఐపై అనవసర భయాలు: ఏఐతో ఉద్యోగాలు పోతాయన్న భయాలను చందోక్‌ తోసిపుచ్చారు. కొన్ని ఉద్యోగాలు పోయినా, ఏఐ ఆర్కెస్ట్రేటర్‌, ఏఐ ఏజెంట్‌ మేనేజర్‌, ఏజెంట్‌ బాస్‌, ప్రాంప్ట్‌ ఇంజనీర్‌ వంటి అనేక కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయన్నారు. అయితే ఇందుకు అవసరమైన పూర్తి స్థాయి ఏఐ నైపుణ్యాలను యువత అలవర్చుకోక తప్పదన్నారు. ట్రంప్‌ టారి్‌ఫల ప్రభావంపై అడిగిన ప్రశ్నకు మాత్రం చందోక్‌ నేరుగా సమాధానం ఇవ్వలేదు. అయితే ఆర్థిక సంబంధాలు ప్రపంచ పురోగతికి దోహదం చేస్తాయన్నారు. ఐదేళ్లలో భారత్‌లో కోటి మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలనే లక్ష్యానికి మైక్రోసాఫ్ట్‌ ఇండియా కట్టుబడి ఉన్నట్టు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 25 , 2025 | 01:50 AM