Vastu Tips: పావురాలకు ఆహారం పెట్టడం వల్ల ఏమి జరుగుతుందో తెలుసా..
ABN , Publish Date - Jun 21 , 2025 | 06:32 PM
వాస్తు ప్రకారం, పావురాలకు ఆహారం పెట్టడం చాలా మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా పెట్టడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే..
Vastu Tips: వాస్తు ప్రకారం, పావురాలకు ఆహారం పెట్టడం చాలా మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా పెట్టడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. రాహు-కేతు దోషాల నుండి విముక్తి పొందుతారని.. అలాగే ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటాయని అంటున్నారు. అయితే, పావురాలకు ఆహారం పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మంచి ఫలితాలు
హిందూ శాస్త్రంలో మూగ జంతువులు, పక్షులకు సేవ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. పక్షులకు, ముఖ్యంగా పావురాలకు ఆహారం పెట్టడం వల్ల రాహువు, కేతువు, శని వంటి చెడు గ్రహాలు శాంతిస్తాయి. జీవితంలో సమస్యలు, కోర్టు కేసులు, శత్రువుల అడ్డంకులు లేదా మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్న వారు ప్రతిరోజూ పావురాలకు పప్పులు లేదా ధాన్యాలు వేయడం మంచిది. ఇలా చేయడం ద్వారా ఈ సమస్యలన్నింటి నుండి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే, పావురాలకు ధాన్యాలు వేయడం ద్వారా అవి మీ ప్రతికూల శక్తిని గ్రహిస్తాయి.
ప్రతికూల శక్తి ఉండదు
వాస్తు శాస్త్రం ప్రకారం, జంతువులు, పక్షులకు ఆహారం, నీరు ఇస్తే వారి ఇంట్లో ప్రతికూల శక్తి ఉండదు. జాతకంలో శని ఉన్నవారు శనివారం నాడు పావురాలకు మినప్పప్పు లేదా నల్ల నువ్వులు పెట్టడం మంచిది. ఇలా చేయడం వల్ల శని దోషం తొలగిపోతుంది. రాహు-కేతు లేదా కాలసర్ప దోషంతో బాధపడేవారు క్రమం తప్పకుండా పావురాలకు ఆహారం పెట్టాలి. ఇలా చేయడం వల్ల మానసిక ఒత్తిడి, గందరగోళం నుండి ఉపశమనం లభిస్తుంది.
ఇంట్లోకి సానుకూల శక్తి
మత విశ్వాసాల ప్రకారం, పక్షులకు ధాన్యాలు పెట్టడం ద్వారా మన పూర్వీకులు కూడా సంతృప్తి చెందుతారు. పితృ దోషాన్ని తొలగిపోతుంది. పూర్వీకులు కూడా ప్రశాంతంగా ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం, పక్షులకు ఆహారం పెట్టడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. పక్షులకు క్రమం తప్పకుండా ఆహారం పెట్టే వ్యక్తులు తమ ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక సమస్యలను ఎదుర్కోరు. పక్షులకు ఆహారం, నీరు ఇచ్చేవారి గ్రహాలన్నీ బలపడతాయని మత గ్రంథాలలో ప్రస్తావించారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
ఉదయం నిద్రలేచిన తర్వాత ఇలా ఉంటే.. జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు..
ఈ డాక్యుమెంట్లు ఉంటే ట్రాఫిక్ చలాన్ నుండి మీరు సేఫ్
For More Lifestyle News