Share News

YS Sharmila : పోలవరంపై మాట్లాడే నైతికత వైసీపీకి లేదు

ABN , Publish Date - Mar 06 , 2025 | 05:56 AM

‘పోలవరంపై మాట్లాడే నైతికత వైసీపీకి లేదు. పోలవరం పేరు వింటేవైఎస్ఆర్‌ గుర్తుకు వచ్చే వారికి... ఐదేళ్లు అధికారం ఇస్తే గాడిదలు కాశారా?

YS Sharmila : పోలవరంపై మాట్లాడే నైతికత వైసీపీకి లేదు

  • ప్రాజెక్టు నిర్వీర్యానికి కర్త, కర్మ, క్రియ జగనే: షర్మిల

అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ‘పోలవరంపై మాట్లాడే నైతికత వైసీపీకి లేదు. పోలవరం పేరు వింటేవైఎస్ఆర్‌ గుర్తుకు వచ్చే వారికి... ఐదేళ్లు అధికారం ఇస్తే గాడిదలు కాశారా? ఆయన జీవిత ఆశయం పోలవరం అని వారికి తెలియదా?’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. బుధవారం ఆమె ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘జగన్‌... అధికారంలో ఉండగా తట్టెడు మట్టి అయినా తీశారా? ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు కుదించే ప్రతిపాదనకు ఒప్పుకున్నది మీరు కాదా? నాడు ప్రధానికి రాసిన లేఖలోనూ 41.15 మీటర్ల మేరకు నిధులు విడుదల చేయాలని అడగలేదా? పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్రలో చంద్రబాబు భాగస్వామి అయితే, కర్త, కర్మ, క్రియ జగన్మోహన్‌రెడ్డే’ అని షర్మిల మండిపడ్డారు.

Updated Date - Mar 06 , 2025 | 05:56 AM