Share News

గత ప్రభుత్వంలో ప్రాజెక్టులు అధోగతి: లంకా

ABN , Publish Date - Feb 19 , 2025 | 06:17 AM

వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులను అధోగతి పాలుచేశారని 20 సూత్రా ల కమిటీ చైర్మన్‌ లంకా దినకర్‌ అన్నారు.

గత ప్రభుత్వంలో ప్రాజెక్టులు అధోగతి: లంకా

కడప కలెక్టరేట్‌, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులను అధోగతి పాలుచేశారని 20 సూత్రా ల కమిటీ చైర్మన్‌ లంకా దినకర్‌ అన్నారు. మంగళవారం కడప పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆకాంక్షల జిల్లాగా కడపకు ప్రఽథమస్థానం వస్తుండటం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జల్‌జీవన్‌ ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు, పట్టణాల్లో అమృత్‌ పథకం ద్వారా తాగునీరు ఇస్తున్నామన్నారు. అయితే జల్‌ జీవన్‌ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం అచేతనం చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వ వైఫల్యం వల్ల పీఎం ఫసల్‌ బీమా పథకం ఇవ్వడంలో రైతులకు అన్యాయం జరిగిందన్నారు. కేంద్రం ఎరువుల సబ్సిడీకి రూ.1565 కోట్లు ఇస్తే వైసీపీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని దినకర్‌ విమర్శించారు.

Updated Date - Feb 19 , 2025 | 06:17 AM