Share News

Rayapati Shailaja: వేధింపులను క్షణం కూడా భరించొద్దు

ABN , Publish Date - Jul 24 , 2025 | 03:59 AM

మహిళలు, బాలికలు లైంగిక వేధింపులను క్షణం కూడా భరించవద్దని, ధైర్యంగా బయటకువచ్చి చెప్పాలని ఏపీ

Rayapati Shailaja: వేధింపులను క్షణం కూడా భరించొద్దు

  • మహిళలు, బాలికలు ధైర్యంగా బయటికి చెప్పాలి: రాయపాటి శైలజ

అనంతపురం క్రైం, జూలై 23(ఆంధ్రజ్యోతి): మహిళలు, బాలికలు లైంగిక వేధింపులను క్షణం కూడా భరించవద్దని, ధైర్యంగా బయటకువచ్చి చెప్పాలని ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ సూచించారు. అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె, నగరంలోని ఎస్‌ఎ్‌సబీఎన్‌ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ‘మహిళల రక్షణ, భద్రత-సాధికాతర’పై అవగాహన సదస్సులో ప్రసంగించారు. పనిచేసే చోట, కళాశాలలు, ఇతర ప్రాంతాల్లో మహిళలు, బాలికలకు వేధింపులు ఎదురవుతూ ఉంటాయని ఆమె అన్నారు. ఆపద సమయాల్లో హెల్‌లైన్‌ నంబర్లు వాడాలని, శక్తి యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. అనంతరం ఐసీడీఎస్‌ శాఖకు సంబంధించిన పలు పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. సదస్సు తర్వాత మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ మీడియాతో మాట్లాడుతూ.. సినిమాలు, సీరియల్స్‌ ప్రభావం నేటి యువత, అమ్మాయిలపై ఎక్కువగా ఉందన్నారు. అలాంటి వాటిపై సెన్సార్‌ కట్‌ ఉండాలని సూచించారు. ‘ఇటీవల భార్యల చేతిలో భర్తలు ఎక్కువగా హత్యకు గురవతున్నారు..? వీటిపై నివేదిక అడిగారా?’ అని విలేకరులు ప్రశ్నించగా, అలా చేయించే మహిళల వెనుక కూడా మగవాళ్లు ఉన్నారుగా అన్నారు.

Also Read:

దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!

శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!

For More Health News

Updated Date - Jul 24 , 2025 | 03:59 AM