Penukonda: మహిళను కొట్టి.. జుత్తు కత్తిరించారు!
ABN , Publish Date - Jan 16 , 2025 | 05:34 AM
ప్రేమ జంట పరారీకి సహకరించిందన్న అనుమానంతో ఓ మహిళపై దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టడంతోపాటు ఆమె జుత్తును కత్తిరించారు.

ప్రేమజంట పరారీకి సహకరించిందనే అనుమానంతోనే..
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో దారుణం
22 మందిపై కేసు నమోదు
పెనుకొండ రూరల్, జనవరి 15(ఆంధ్రజ్యోతి): ప్రేమ జంట పరారీకి సహకరించిందన్న అనుమానంతో ఓ మహిళపై దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టడంతోపాటు ఆమె జుత్తును కత్తిరించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు ప్రేమ పేరుతో ఈ నెల 9వ తేదీన ఓ బాలికతో పరారయ్యాడు. రెండు రోజుల తర్వాత తిరిగి గ్రామానికి చేరుకొని ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు.
బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు అనిల్‌పై కియ పోలీసుస్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. కాగా, బాలిక కుటుంబ సభ్యులు బుధవారం గ్రామంలోని వెంకటలక్ష్మమ్మపై దాడి చేసి, ఆమె జుత్తును కత్తిరించారు. బాలిక ప్రేమ వ్యవహారంతో తనకు సంబంధం లేకపోయినా ఆమ బంధువులు తన ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా కొట్టారని, తన జుత్తును కత్తిరించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో 22 మందిపై కేసు నమోదు చేశామని కియ పోలీసులు తెలిపారు.