Andhra Pradesh: నరసాపురంలో ఉద్రిక్తత.. సామాజిక వర్గాల మధ్య కొట్లాట..
ABN , Publish Date - Feb 07 , 2025 | 06:27 PM
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకుంటున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా: నరసాపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకుంటున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా ఇరు వర్గాలు తిరగబడుతున్నాయి. నిన్న రాత్రి ఇరువర్గాల మధ్య చెలరేగిన వివాదం చిలికిచిలికి గాలివానలా మారి ఇప్పుడు పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది. ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
అసలేం జరిగిందంటే.. దువ్వలో సూర్యాలయం దగ్గర భజన చేస్తున్న మహిళలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. భక్తులు భజన చేస్తూంటే అగంతకులు వచ్చి మైక్ లాక్కూన్నారని, మహిళలపై బీరు సీసాలతో దాడి చేసినా పోలీసు అధికారులు సరిగ్గా స్పందించలేదని దువ్వ ఎన్‌హెచ్‌పై భక్తులు నిరసన చేపట్టారు.ఈ ఘటనలో పోలీసుల తీరును ఖండిస్తూ బీజేపీ నేత తపన చౌదరి నిరసనలకు పిలుపునిచ్చారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేపట్టారు. ఒకరిని మాత్రమే అరెస్ట్ చేయడం దారుణమని బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. మహిళ భక్తులపై దాడి చేసిన మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.