Share News

West Godavari : ఆత్మహత్యా? తుపాకీ మిస్‌ ఫైరా..?

ABN , Publish Date - Feb 01 , 2025 | 05:05 AM

తణుకు రూరల్‌ ఎస్‌ఐ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారా? లేక మిస్‌ ఫైర్‌ అయ్యిం దా? అనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మూర్తి తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని

 West Godavari : ఆత్మహత్యా? తుపాకీ మిస్‌ ఫైరా..?

  • పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్‌ఐ అనుమానాస్పద మృతి

  • మూడు నెలలుగా వీఆర్‌లో..

తణుకు రూరల్‌, జనవరి 31(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్‌ ఎస్‌ఐగా పనిచేసిన ఆదుర్తి గంగ సత్యనారాయణ మూ ర్తి(38) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారా? లేక మిస్‌ ఫైర్‌ అయ్యిం దా? అనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మూర్తి తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఉదయం నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తుపాకీ మిస్‌ ఫైర్‌ అయ్యిందని జిల్లా ఎస్పీ నయీం ఆస్మి చెప్పడం గమనార్హం. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కె.గంగవరం గ్రామానికి చెందిన సత్యనారాయణమూర్తికి భార్య విజయలక్ష్మి, కుమారుడు చందన్‌(5), కుమార్తె హేమాన్షి(16 నెలలు) ఉన్నారు. 2012 బ్యాచ్‌కు చెందిన మూర్తి కృష్ణా జిల్లాలో ఎస్‌ఐగా చేరి, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, పాలకోడేరు, ఆచంట, పెరవలి స్టేషన్లలో ఎస్‌ఐగా చేశారు. గత ఏడాది జూలైలో తణుకు రూరల్‌ స్టేషన్‌కు బదిలీపై వచ్చారు. గతంలో జరిగిన గేదెల దొంగతనానికి సంబంధించిన కేసు రికవరీలో జరిగిన అవకతవకల వ్యవహారం లో ఉన్నతాధికారులు మూర్తిని నవంబరులో వీఆర్‌కు పంపారు. పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటనకు బందోబస్తు డ్యూటీ పడటంతో శుక్రవారం ఉదయం 7.30 గంటలకు మూర్తి డ్యూటీ డ్రస్‌లో తణుకు రూరల్‌ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. రివాల్వర్‌ తీసుకుని వాష్‌ రూమ్‌కు వెళ్లారు. ఎంతకీ బయటకు రాకపోవడంతో సిబ్బంది వెళ్లి చూడగా.. మూర్తి రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించి, ఆయన్ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మూర్తి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎస్‌ఐ మృతికి పోలీసులు, ఓ న్యూస్‌ చానలే కారణమని ఆయన బంధువులు ఆరోపించారు.


తుపాకీ మిస్‌ ఫైర్‌: ఎస్పీ

ఎస్‌ఐ మూర్తి మృతిపై విచారణ చేపడతామని జిల్లా ఎస్పీ నయీం అస్మీ తెలిపారు. ‘ఉదయం స్టేషన్‌కు వచ్చిన మూర్తి మరుగుదొడ్డిలోకి వెళ్లారు. అక్కడ ఆయన రివాల్వర్‌ మిస్‌ పైర్‌ అయ్యింది. ఆస్పత్రికి తరలించగా మరణించినట్లు చెప్పారు.’ అని పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రిలోని ఎస్‌ఐ భౌతికాయాన్ని ఆయన సందర్శించారు.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 05:05 AM