Share News

Minister Janardhan Reddy:జల రవాణాలో అధిక పెట్టుబడులే లక్ష్యం

ABN , Publish Date - Jun 03 , 2025 | 04:47 AM

వాటర్‌వేస్‌ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. బోట్‌ మారథాన్‌లో మంత్రి జనార్దన్‌ మాట్లాడుతూ జల మార్గాలు మూడు రెట్లు పెంచే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.

Minister Janardhan Reddy:జల రవాణాలో అధిక పెట్టుబడులే లక్ష్యం

  • ఆ మార్గాలను మూడింతలు పెంచేలా చర్యలు: మంత్రి జనార్దన్‌

లరవాణాలో అధిక పెట్టుబడులే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం విజయవాడలోని కృష్ణా నదిలో పున్నమిఘాట్‌ వద్ద బోట్‌ మారథాన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జలమార్గాల ద్వారా పోర్టు కనెక్టవిటీ పెరుగుతుందని, పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. పీపీపీ విధానంలో ఆయా ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇన్‌లాండ్‌ క్యూయిజ్‌ టూరిజాన్ని ప్రోత్సహిస్తాన్నారు.

Updated Date - Jun 03 , 2025 | 04:49 AM