Share News

Excise department: ఎక్సైజ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడిగా కె.కామేశ్వరరావు

ABN , Publish Date - Mar 10 , 2025 | 02:13 AM

ఆదివారం విజయవాడలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. 13 ఉమ్మడి జిల్లాల అధికారులు ఎన్నికల్లో ఓటు వేశారు. అధ్యక్షుడు మినహా మిగిలిన కార్యవర్గాన్ని ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Excise department: ఎక్సైజ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడిగా కె.కామేశ్వరరావు

అమరావతి, మార్చి 9(ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్‌ శాఖ ఎగ్జిక్యూటివ్‌ అధికారుల సంఘం నూతన అధ్యక్షుడిగా కె.కామేశ్వరరావు ఎన్నికయ్యారు. ఆదివారం విజయవాడలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. 13 ఉమ్మడి జిల్లాల అధికారులు ఎన్నికల్లో ఓటు వేశారు. అధ్యక్షుడు మినహా మిగిలిన కార్యవర్గాన్ని ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా ఎస్‌.ప్రభాకర్‌రావు, కోశాధికారిగా సి.సురే్‌షకుమార్‌, ఉపాధ్యక్షులుగా బీవీ మురళీధర్‌, వి.వైకుంఠరావు, ఎం.యశోధరదేవి, ఈ.నరసానాయుడు, అసోసియేట్‌ ప్రెసిడెంట్లుగా సీహెచ్‌ఎ్‌సఎల్‌పీ కుమార్‌, ఎ.సతీష్‌, పోలూరి రాధాకష్ణమూర్తి, సి.నరే్‌షబాబు తదితరులు ఎన్నికయ్యారు.


Read more :

Also Read: మెడికోకి బెదిరింపు.. నిందితుల కోసం గాలింపు
Also Read: బ్లాక్ రైస్ ( Black Rice) తినడం వల్ల ఇన్ని లాభాలా..?

Also Read: ఉప రాష్ట్రపతిని పరామర్శించిన ప్రధాని మోదీ

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 10 , 2025 | 02:13 AM