Share News

Raiwada Boat Accident: రైవాడ డ్యామ్‌లో పడవ బోల్తా..

ABN , Publish Date - Nov 23 , 2025 | 05:49 PM

అల్లూరి జిల్లా జీనబాడులో విషాదం నెలకొంది. రైవాడ డ్యామ్‌లో పడవ బోల్తాపడి ముగ్గురు మృతిచెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Raiwada Boat Accident:  రైవాడ డ్యామ్‌లో పడవ బోల్తా..
Raiwada Boat Accident

అల్లూరి సీతారామరాజు జిల్లా, నవంబర్ 23: అనంతగిరి మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. జీనబాడు సమీపంలోని రైవాడ డ్యామ్‌లో ఓ పడవ బోల్తాపడి.. ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ప్రమాదానికి ముందు పడవలో మొత్తం నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. అయితే, ప్రమాదవశాత్తూ పడవ బోల్తాపడటంతో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ఘటనలో కేవలం ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు.


స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, గజ ఈతగాళ్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టగా తొలుత ఒకరి మృతదేహం లభించింది. ఆ తర్వాత తీవ్రంగా గాలించి మిగిలిన ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. చనిపోయిన వారిని అధికారి గోవిందనాయుడు, అరసాడ ప్రదీప్, రాయగడ శరత్‌గా గుర్తించారు. వారంతా సివిని గ్రామానికి చెందినవారిగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మరోవైపు బాధిత కుటుంబాలు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


ఇవీ చదవండి:

తల్లిపాలలో యురేనియం.. అధ్యయనాల్లో వెలుగుచూసిన నిజం

కోవిడ్ లాక్‌డౌన్‌ను తలపిస్తున్న ఎస్ఐఆర్.. మండిపడిన ఖర్గే

Updated Date - Nov 23 , 2025 | 08:59 PM