Share News

Anakapalli Canara Bank: అనకాపల్లి కెనరా బ్యాంక్‌లో దుండగుల హల్‌చల్.. పోలీసుల విచారణ

ABN , Publish Date - Dec 18 , 2025 | 07:57 PM

అనకాపల్లిలోని కెనరా బ్యాంక్ శాఖలో కొందరు దుండగులు హల్చల్ చేశారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Anakapalli Canara Bank: అనకాపల్లి కెనరా బ్యాంక్‌లో దుండగుల హల్‌చల్.. పోలీసుల విచారణ
Anakapalli Canara Bank

విశాఖపట్నం, డిసెంబర్ 18: అనకాపల్లిలోని కెనరా బ్యాంక్ శాఖలో గురువారం గుర్తు తెలియని దుండగులు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. క్రైమ్ అడిషనల్ ఎస్పీ ఎల్.మోహన్ రావు బ్యాంకును సందర్శించి పలు వివరాలను సేకరించినట్టు తెలుస్తోంది.


అసలేం జరిగిందంటే?

అనకాపల్లిలోని కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో ఓ గుర్తుతెలియని ముఠా ప్రవేశించి దోపిడీకి యత్నించింది. బ్యాంకులోకి వచ్చిన ఆ దుండగులు కాసేపు హల్చల్ చేశారు. సుమారు ఐదుగురు దోపిడీదారులు.. మేనేజర్‌కు తుపాకీ చూపించి బెదిరిస్తూ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే.. చాకచక్యంగా వ్యవహరించిన ఆ మేనేజర్.. వెంటనే అలారమ్ నొక్కడంతో దుండగులు భయపడి అక్కడి నుంచి పరారయ్యారు.


ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. మొత్తం ఏడుగురు దుండగులు రెండు బైకులపై బ్యాంకుకు వచ్చినట్టు సమాచారం. వారి వద్ద రెండు తుపాకీలు ఉన్నట్టు పోలీస్ అధికారులు గుర్తించారు. బ్రాంచ్ మేనేజర్ సౌజన్యకు రెండు తుపాకీలు చూపించి హ్యాట్సాఫ్ అని దుండగులు బెదిరించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.


ఇవీ చదవండి:

జోగి రమేష్ బ్రదర్స్‌కు దక్కని ఊరట

పాలిచ్చే స్త్రీలు థైరాయిడ్ మందులు తీసుకోవచ్చా?

Updated Date - Dec 18 , 2025 | 07:57 PM