అన్నదాత సుఖీభవ సొమ్ములు జమ

ABN, Publish Date - Nov 20 , 2025 | 01:28 AM

‘అన్నదాత సుఖీభవ’ పథకం రెండో విడత నిధులను రైతులకు బుధవారం పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి రైతు ఖాతాకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.ఐదు వేలు, కేంద్రం పీఎం కిసాన్‌ కింద రూ.రెండు వేల చొప్పున జమ చేశారు. ప్రతి రైతుకు రూ.ఏడు వేలు అందాయి.

విశాఖపట్నం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి):

‘అన్నదాత సుఖీభవ’ పథకం రెండో విడత నిధులను రైతులకు బుధవారం పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి రైతు ఖాతాకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.ఐదు వేలు, కేంద్రం పీఎం కిసాన్‌ కింద రూ.రెండు వేల చొప్పున జమ చేశారు. ప్రతి రైతుకు రూ.ఏడు వేలు అందాయి. విశాఖ జిల్లాలో పీఎం కిసాన్‌ 16,769 మందికి, అన్నదాత సుఖీభవ 18,573 మందికి వర్తించింది. వీరికి సుమారు రూ.12.64 కోట్లు పంపిణీ చేశారు. భీమిలి నియోజకవర్గంలో అత్యధికంగా రూ.10.06 కోట్లు, పెందుర్తి రూ.2.2 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేశారు. మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో అతి తక్కువ మంది రైతులు ఉన్నారు.

నియోజకవర్గం పీఎం కిసాన్‌ జమ చేసిన అన్నదాత జమ చేసిన లబ్ధిదారులు సొమ్ము సుఖీభవ సొమ్ము రూ.కోట్లలో

భీమిలి 12,856 2.57 14,981 7.49

గాజువాక 562 0.11 466 0.23

పెందుర్తి 3289 0.65 3126 1.56

విశాఖ పశ్చిమ 34 0.0068 0 0

విశాఖ తూర్పు 9 0.0018 0 0

విశాఖ ఉత్తర 19 0.0038 0 0

మొత్తం 16,769 3.35 18,573 9.28

Updated at - Nov 20 , 2025 | 01:28 AM