Pawan Visit Alluri District: అప్పుడు చెప్పా.. ఇప్పుడు సాకారం
ABN , Publish Date - Apr 07 , 2025 | 04:47 PM
Pawan Visit Alluri District: గిరిజనుల కష్టంలో అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని ఉపముఖ్యమంత్రి పవన్ వెల్లడించారు. దేశం మొత్తం పర్యాటకులను ఆకర్షించే అరకు పర్యాటక అభివృద్ధి కోసం సీఏం చంద్రబాబు, మంత్రి దుర్గేష్‌లతో మాట్లాడతానని అన్నారు. 15 ఏళ్ళ పాటు కూటమి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలన్నారు.

అల్లూరి జిల్లా, ఏప్రిల్ 7: జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) బిజీబిజీగా గడిపారు. అరకులోయలో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో భాగంగా అల్లూరి జిల్లా డుంబ్రిగూడా మండలం పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామంలో జన్మన్ పథకం కింద మంజూరైన రహదారులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. మూడు నెలలు క్రితం చెప్పానని.. ఈరోజు కల సాకారమైందని అన్నారు. డోలీ మోత తప్పాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఇక్కడ పర్యాటకం అభివృద్ధి అవ్వాలని ఆకాంక్షించారు. వైసీపీ హయాంలో మొత్తం 90 కిలోమీటర్లు రోడ్లు వేస్తే.. కూటమి 8 నెలల్లో 1069 కిలోమీటర్లు రోడ్లు వేశామని.. ఇది కూటమి ప్రభుత్వానికి వైసీపీకి మధ్య ఉన్న తేడా అని చెప్పుకొచ్చారు.
కూటమికి ఓట్లు వెయ్యక పోయినా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రం మొత్తం 3700 గ్రామాలు ఉంటే ఇంకా 1177 ఆవాసాలకు రోడ్లు వేయాలన్నారు. మొత్తం రూ.1005 కోట్లు కేటాయించారని తెలిపారు. డబ్బులను చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నామని అన్నారు. పెదపాడులో 12 సమస్యలు దృష్టికి తెచ్చారని.. వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. గిరిజన ప్రాంతంలో గంజాయి వ్యసనంకు లోను కాకూడదని మనవి చేశారు. యువత గంజాయి సాగు చేయొద్దని... పర్యాటక ప్రాంతంలో అనేక అవకాశాలు చేజెక్కించుకోవాలని సూచించారు. రోడ్లు అభివృద్ధి చేశాకా... అంబులెన్సు గిరిజన మారుమూల ప్రాంతాలకు వెళ్తున్నాయన్నారు.
Dr. Prabhavati Qestioned: మెడికల్ రిపోర్ట్ ఎందుకలా ఇచ్చారు.. ప్రభావతిని ప్రశ్నిస్తున్న ఎస్పీ
గిరిజనుల కష్టంలో అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని వెల్లడించారు. దేశం మొత్తం పర్యాటకులను ఆకర్షించే అరకు పర్యాటక అభివృద్ధి కోసం సీఏం చంద్రబాబు (CM Chandrababu Naidu), మంత్రి దుర్గేష్‌లతో (Minister Durgesh) మాట్లాడతానని అన్నారు. 15 ఏళ్ళ పాటు కూటమి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలన్నారు. రాష్ట్రానికి మేలు చేసేలా చంద్రబాబు ఆలోచనలు చేస్తారని తెలిపారు. ప్రజల్లో తిరిగి తాము కష్టాలను తెలుసుకుంటున్నామని.. రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి అవ్వాలని.. అదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
కాగా.. జన్మన్ పథకం కింద అల్లూరి ఏజెన్సీకి 167 రోడ్లు మంజూరయ్యాయి. పెదపాడు గ్రామంలో గడ్డపార పట్టి భూమి పూజ చేశారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా పెదపాడు గ్రామస్తులతో సుమారు రెండు గంటల పాటు పవన్ సమావేశమయ్యారు. ఆపై అంగన్వాడి కేంద్రంలో గర్భిణులకు కిట్లను పంపిణీ చేశారు. గ్రామంలోని చిన్నారులకు తనతో తెచ్చిన స్వీట్ బాక్సులను పంచిపెట్టారు ఉపముఖ్యమంత్రి. గ్రామస్తులతో ముఖాముఖిలో గ్రామస్తులు అడిగిన 12 సమస్యలను ఆరు నెలల్లోపు పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్‌కు డిప్యూటీ సీఎం సూచించారు. ఇదేకాక మీ గ్రామానికి మరింత సదుపాయాలను సమకూర్చేందుకు ప్రయత్నిస్తానని అన్నారు.
‘మీతో పాటు నడిచి మీ కష్టాన్ని చూశాను కనుకనే ఈ రహదారులను పోరాడి సాధించాను’ అని అన్నారు. ఈ నియోజకవర్గంలో మాకు ఓటు వేయకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తాను చర్చించుకుని ఈ రహదారులను మంజూరు చేయించామన్నారు. గ్రామానికి సుమారు ఒక కిలోమీటర్ దూరం నుంచి నడుచుకుంటూ గిరిజన మహిళలతో మాట్లాడుకుంటూ గ్రామానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ గ్రామస్తులతో మాట్లాడుతూ ఒరియా భాషలో గిరిజనులకు నమస్సుమాంజలు తెలిపారు. గ్రామస్తులు పండించిన మిల్లెట్లను పరిశీలించి వాటిని రుచి చూశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజినల్ చైర్మన్ దొన్నుదొర, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్డార్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
Prabhavati Investigation: విచారణకు వచ్చిన ప్రభావతి.. కానీ
YS Sharmila Criticizes AP Govt: నిలిచిన వైద్య సేవలు.. సర్కార్‌పై షర్మిల ఫైర్
Read Latest AP News And Telugu News