Share News

Visakhapatnam: విశాఖలో బ్రౌన్‌ షుగర్‌ స్వాధీనం

ABN , Publish Date - Feb 15 , 2025 | 05:14 AM

విశాఖ నగరంలోని విశాలాక్షినగర్‌ ప్రాంతంలో కొందరి వద్ద మాదకద్రవ్యాలు ఉన్నట్టు టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో...

Visakhapatnam: విశాఖలో బ్రౌన్‌ షుగర్‌ స్వాధీనం

పోలీసుల అదుపులో ముగ్గురు ఒడిశా వాసులు

ఆరిలోవ (విశాఖపట్నం), ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): విశాఖ నగరంలోని విశాలాక్షినగర్‌ ప్రాంతంలో కొందరి వద్ద మాదకద్రవ్యాలు ఉన్నట్టు టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఆరిలోవ పోలీసులతో కలిసి శుక్రవారం దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాలాక్షి నగర్‌ ప్రాంతంలో ఉన్న ఒడిశాకు చెందిన ముగ్గురి వద్ద డ్రగ్స్‌ ఉన్నట్టు సమాచారం అందింది. దీంతో మహ్మద్‌ చాంద్‌బాబు, షేక్‌ అనీష్‌, షేక్‌ ముజఫర్‌ అనే వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వారి నుంచి రెండు గ్రాముల బ్రౌన్‌ షుగర్‌ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. వీరు ఒడిశాలో అరబ్‌ అనే వ్యక్తి నుంచి బ్రౌన్‌ షుగర్‌ కొనుగోలు చేసి, ఈ ప్రాంతంలో విక్రయానికి తెచ్చినట్టు సీఐ తెలిపారు. వీరిని పూర్తిస్థాయిలో విచారిస్తున్నామని, అనంతరం కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CRDA: రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు

Srinivas Verma: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

Updated Date - Feb 15 , 2025 | 05:14 AM