Share News

Vijayawada Utsav: విజయవాడ ఉత్సవ్ పిటిషన్‌ను కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం

ABN , Publish Date - Sep 22 , 2025 | 01:41 PM

దేవాదాయ శాఖ పరిధిలోని స్థలంలో విజయవాడ ఉత్సవ్ నిర్వహణపై దాఖలైన పిటిషన్‌‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది.

Vijayawada Utsav: విజయవాడ ఉత్సవ్ పిటిషన్‌ను కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం
Vijayawada Utsav Supreme Court,

ఇంటర్నెట్ డెస్క్: విజయవాడ ఉత్సవ్‌పై సుప్రీం కోర్టును ఆశ్రయించిన స్థానిక భక్తులకు చుక్కెదురైంది. వారు దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. దేవాదాయ శాఖకు చెందిన స్థలంలో విజయవాడ ఉత్సవ్‌ నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దేవాదాయ శాఖ స్థలంలో దైవ కార్యకలాపాలు మినహా ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి లేదని పిటిషన్‌‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఇటీవల హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు (SC dismisses petition Vijayawada festival).

దేవాదాయ శాఖ పరిధిలోని ఆ స్థలం వ్యవసాయ భూమి అని, అక్కడ ఇప్పుడు వ్యాపార పరమైన కార్యక్రమాలు చేపట్టడం విరుద్దమని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ విషయంపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పిటేషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.


ఇవి కూడా చదవండి..

ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ

ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 22 , 2025 | 01:42 PM