Share News

Dravida Kazhagam : సమ సమాజానికి దిక్సూచిగా ప్రపంచ నాస్తిక మహాసభలు

ABN , Publish Date - Jan 05 , 2025 | 04:48 AM

మతోన్మాద శక్తులు మనుషుల మధ్య ద్వేషాలను, అసమానతలను కలిగిస్తున్న తరుణంలో నాస్తిక కేంద్రం నిర్వహిస్తున్న ప్రపంచ నాస్తిక మహాసభలు, ప్రపంచ శాంతికి...

 Dravida Kazhagam : సమ సమాజానికి దిక్సూచిగా ప్రపంచ నాస్తిక మహాసభలు

  • ద్రవిడార్‌ కజగం ట్రెజరర్‌ కుమరేశన్‌

విజయవాడ(పటమట), జనవరి 4 (ఆంధ్రజ్యోతి): మతోన్మాద శక్తులు మనుషుల మధ్య ద్వేషాలను, అసమానతలను కలిగిస్తున్న తరుణంలో నాస్తిక కేంద్రం నిర్వహిస్తున్న ప్రపంచ నాస్తిక మహాసభలు, ప్రపంచ శాంతికి, సమ సమాజానికి దిక్సూచిగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని తమిళనాడుకు చెందిన ద్రవిడార్‌ కజగం ట్రెజరర్‌ కుమరేశన్‌ తెలిపారు. విజయవాడలో శనివారం ప్రారంభమైన ప్రపంచ నాస్తిక మహాసభల్లో ఆయన మాట్లాడుతూ ప్రజల్లో శాస్ర్తీయ విజ్ఞానం, శాస్ర్తీయ దృక్పథం పెంపొందడం ఎంతో అవసరమన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాఽథ్‌(చిన్ని)మాట్లాడుతూ నాస్తిక కేంద్రం కార్యక్రమాలను తన చిన్నతనం నుంచి చూస్తున్నాని, అవి సామాజిక చైతన్యానికి, సమసమాజ నిర్మాణానికి ఎంతో దోహదం చేస్తాయన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ యువత ఆలోచన ధోరణిలో మార్పు రావాలని, బూజుపట్టిన ఛాందస భావాలు వదిలిపెట్టి మానవులంతా ఒకేటన్న భావన పెంపొందించుకోవాలన్నారు. గోరా నాస్తిక కేంద్రం ద్వారా చేపట్టిన కార్యక్రమాలు అందరికి మార్గదర్శకం కావాలని అన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 04:48 AM