Andhra Pradesh weather: ఎండా.. వానలతో అవస్థ
ABN , Publish Date - May 17 , 2025 | 03:55 AM
ఉత్తరాంధ్ర, పశ్చిమ మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు, ఈదురుగాలులు, ఎండల మిశ్రమ వాతావరణం నెలకొంది. వాతావరణ శాఖ శనివారం నుండి రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
నేడు ఉత్తర కోస్తాకు భారీ వర్షసూచన
విశాఖపట్నం, అమరావతి, మే 16 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రకు ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వాయువ్యభారతం నుంచి కోస్తాంధ్ర వరకు పొడిగాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో ఓవైపు ఎండలు, ఉక్కపోత, మరోవైపు ఈదురుగాలులతో వర్షాలు కురుస్తూ భిన్నవాతావరణం నెలకొంది. వర్షం కురిసిన ప్రాంతాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత, ఉక్కపోతకు జనం అవస్థలు పడ్డారు. శుక్రవారం రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షం కురిసింది. రాత్రికి ఎక్కువచోట్ల పిడుగులతో వర్షాలు, రెండు, మూడుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శనివారం కోస్తా, రాయలసీమలో ఎక్కువచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు, ఉత్తరకోస్తాలో రెండు, మూడుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆ తర్వాత రెండు రోజుల్లో రాయలసీమలో ఎక్కువచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎండతీవ్రత, ఉక్కపోత కొనసాగుతుందని, మధ్యాహ్నం సమయంలో ఆరు బయట పనిచేసే కార్మికులు, వ్యవసాయ కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
పర్చూరులో కుంభవృష్టి
ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా బాపట్ల జిల్లా పర్చూరులో 105.74, కృష్ణా జిల్లా తేలప్రోలులో 97, గుంటూరులో 82, ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో 73.5 మిల్లీమీటర్ల వాన పడింది. అనకాపల్లి, కోనసీమ, కడప తదితర జిల్లాల్లో అనేక చోట్ల మోస్తరు వర్షాలు పడ్డాయి. దీంతో శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు తగ్గాయి. చాలా చోట్ల 31-38.5 డిగ్రీల మధ్య నమోదయ్యాయు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం జగతిపల్లి బూర్జగూడ, పాలకొండ ఎన్‌ఎ్‌సఎన్ కాలనీలలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News